ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల విక్రయానికి ఓరాకిల్, వాల్‌మార్ట్‌లతో సరైన ఒప్పందం కుదరకుంటే.. నిషేధం తప్పదని స్పష్టం చేశారు.
టిక్‌టాక్ అమెరికా వ్యాపారాలను నిర్వహించేందుకు టెక్దిగ్గజం ఒరాకిల్, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని ట్రంప్ ఆదివారం ప్రకటించి.. సోమవారం ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
'టిక్‌టాక్‌కు అమెరికాలో దాదాపు 10 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.. దీన్ని ఇక్కడ ప్రత్యేక కంపెనీగా నమోదు చేసేందుకు ఒరాకిల్, వాల్‌మార్ట్‌లు చర్చలు జరుపుతున్నాయని.. అందుకు తమనుంచి పూర్తి సహకారం ఉంటుంద'ని కూడా ట్రంప్ ఆదివారం వెల్లడించారు.
తాజా ప్రకటనలో.. ప్రస్తుతం ఈ ఒప్పందం చర్చల దశలో ఉందని ఇప్పటివరకూ అంతా సవ్యంగానే సాగుతున్నట్లు ట్రంప్ వివరించారు. అంతా పద్ధతిగా ఉంటే టిక్‌టాక్ అమెరికాలో ఉంటుందని లేదంటే నిషేధిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:టిక్‌టాక్ డీల్‌పై ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన వివరాలు..