ETV Bharat / business

టీసీఎస్​కు భారీ లాభాలు... డివిడెండ్​ ప్రకటన - టీసీఎస్​ క్యూ2 ఫలితాలు

టెక్​ దిగ్గజం టీసీఎస్​ రెండో త్రైమాసికంలో(tcs quarterly results ) అద్భుత పనితీరు కనబరిచింది. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 46,867 కోట్ల ఆదాయం, రూ.9,624 కోట్ల నికర లాభం ఆర్జించింది.

tcs quarterly results
టీసీఎస్​కు భారీ లాభాలు
author img

By

Published : Oct 8, 2021, 7:47 PM IST

Updated : Oct 9, 2021, 7:29 AM IST

దేశీయ సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రెండో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరులో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.9,624 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.8,433 కోట్లతో పోలిస్తే, ఇది 14.1 శాతం అధికం. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం కూడా రూ.40,135 కోట్ల నుంచి 16.8 శాతం వృద్ధితో రూ.46,867 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 15.5 శాతంగా నమోదైంది.

  • కంపెనీ అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి సాధించింది. తయారీ విభాగంలో 21.7 శాతం, లైఫ్‌ సైన్సెస్‌-ఆరోగ్య సంరక్షణలో 19 శాతం, రిటైల్‌, సీపీజీలో 18.4 శాతం, బ్యాంకింగ్‌-ఆర్థిక సేవలు-బీమాలో 17 శాతం, కమ్యూనికేషన్స్‌-మీడియాలో 15.6 శాతం, టెక్నాలజీ-సేవల్లో 14.8% వృద్ధి నమోదైంది.
  • ఉత్తర అమెరికా వ్యాపారంలో 17.4 శాతం వృద్ధి నమోదైంది. యూకేలో 15.6 శాతం, ఐరోపాలో 13.5 శాతం వృద్ధి కనిపించింది. వర్ధమాన విపణుల్లో భారత్‌ 20.1 శాతం వృద్ధితో ముందు వరుసలో ఉండగా, లాటిన్‌ అమెరికా 15.2 శాతం, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా 13.8 శాతం, ఆసియా పసిఫిక్‌ 7.6 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
  • సమీక్షా త్రైమాసికంలో 100 మిలియన్‌ డాలర్ల విభాగంలోకి కొత్తగా అయిదుగురు ఖాతాదారులు జత కావడంతో మొత్తం సంఖ్య 54కు చేరింది. 50 మిలియన్‌ డాలర్ల విభాగంలో కొత్తగా 17 మంది జతై, ఈ సంఖ్య 114కు పెరిగింది.
  • కంపెనీ ఎండీ, సీఈఓగా మరో అయిదేళ్లు రాజేశ్‌ గోపీనాథన్‌ పునర్నియామకానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
  • రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.7 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
  • బీఎస్‌ఈలో షేరు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.3,990కి చేరింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 1.1 శాతం లాభంతో రూ.3,935.30 వద్ద ముగిసింది. టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.14.5 లక్షల కోట్లను అధిగమించింది.
  • ఉత్తర అమెరికా, బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌, తయారీ విభాగాలు ఊపందుకోవడంతో సెప్టెంబరు త్రైమాసికంలో మొత్తం ఒప్పందాల కాంట్రాక్టు విలువ 760 కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) జూన్‌, సెప్టెంబరు త్రైమాసికాలు రెండు కలిపితే 1,570 కోట్ల డాలర్ల ఒప్పందాలు జరిగాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 78,000 నియామకాలు

సెప్టెంబరు త్రైమాసికంలో నికరంగా 19,690 మందిని నియమించుకోవడంతో, సంస్థలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,28,748కి చేరింది. గత 6 నెలల్లో 43,000 మంది తాజా పట్టభద్రుల్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. రెండో అర్ధభాగంలోనూ మరో 35,000 మందిని(మొత్తం 78,000మంది) నియమించుకోవాలనుకుంటున్నారు. ఐటీ సేవల వలసల రేటు 11.9 శాతంగా నమోదైంది.

బలమైన, స్థిర గిరాకీ వాతావరణం దశాబ్దానికి ఒకసారి లభించే అవకాశం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదార్లు డిజిటలీకరణ కోసం మమ్మల్ని భాగస్వాములుగా ఎంచుకున్నారు. వారి నమ్మకాన్ని రుజువు చేస్తూ, మంచి వృద్ధి సాధించి మా స్థానాన్ని నిలబెట్టుకున్నాం. మా బ్రాండ్‌ను బలోపేతం చేయడం సహా సమగ్ర పోర్ట్‌ఫోలియోను నిర్మించడం కోసం పెట్టుబడులు పెడుతున్నాం. వాటాదార్లందరికీ దీర్ఘకాలిక విలువ అందించడానికి ఇదే అత్యుత్తమ మార్గమని నమ్ముతున్నాం.

- రాజేశ్‌ గోపీనాథన్‌, ఎండీ, సీఈఓ, టీసీఎస్‌.

Last Updated : Oct 9, 2021, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.