ETV Bharat / business

సరికొత్త హంగులతో 'టాటా సఫారీ' - ఎస్​యూవీ సఫారీ

ఆటోమొబైల్​ దిగ్గజం టాటా మోటర్స్​ మరో వాహనంతో మార్కెట్​లోకి వచ్చింది. 'అడ్వెంచర్​ పర్సోనా' పేరుతో తీసుకొచ్చిన సఫారీని నేడు మార్కెట్​లోకి విడుదల చేశారు.

tata motors released adventure persona safari today
సరికొత్త హంగులతో టాటా నుంచి మరో సఫారీ
author img

By

Published : Feb 22, 2021, 6:53 PM IST

ప్రముఖ ఆటో మొబైల్​ దిగ్గజం టాటా మోటర్స్​ మరో సరికొత్త వాహనాన్ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. గతంలో పాపులర్ అయిన ఎస్​యూవీలోని సఫారీ రకాన్ని సరికొత్త లుక్​తో విడుదల చేసింది. రూ.14.69లక్షల ప్రారంభ ధరతో ఈ వాహనం మొత్తం 11 వేరియంట్లలో లభిస్తుంది. రూ. 30వేల చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొంది టాటా మోటర్స్.

ప్రత్యేకతలు ఇవే..

  • 2 లీటర్​ బీఎస్​ 6, నాలుగు సిలిండర్, క్రయోటెక్ టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్ ఉంటుంది.
  • 6 లేదా 7 సీట్ల సామర్థ్యం.
  • జెనాన్ హెచ్ఐడీ ప్రొజెక్టర్
  • హెడ్ ల్యాంప్స్
  • టర్న్ ఇండికేటర్​లతో కూడిన డ్యుయల్ ఫంక్షన్ డీఆర్ఎల్స్
  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • సిగ్నేచర్ ట్విన్ లైట్
  • ఎల్ఈడీ టేల్ లైట్
  • 18 అంగుళాల అల్లాయ్ వీల్స్
  • రూఫ్ టేల్స్
  • పనోరమిక్​ సన్ రూప్

డెటోనా గ్రే, రాయల్ బ్లూ, ఆర్కస్ వైట్, ట్రోపికల్ మిస్ట్ రంగుల్లో లభిస్తుంది. టాటా ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడిన 8.8 ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ ఉంటుంది. దీనికి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వాయిస్ రికగ్నిషన్ కాంపాటిబిలిటీ ఉంది.

అదనపు ఫీచర్లు..

తొమ్మిది స్పీకర్ల సౌండ్ సిస్టమ్ ఈ సఫారీలో ఉంది. ఎలక్ట్రిక్ బ్రేక్ పార్కింగ్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రతాపరంగా ఆరు ఎయిర్​బ్యాగ్​లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్​తో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అన్ని డిస్క్​బ్రేక్​లు ఉండడం ఈ వాహనం ప్రత్యేకత. రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది.

ఇదీ చూడండి: నానో, సుమో, జైలో... ఇక కొత్తవి కొనలేం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.