ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్ సోమవారం ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్‌కు మెజారిటీ వాటా ఉన్న ఎయిర్ ఏషియా ద్వారా ఈ బిడ్ దాఖలు చేసే అవకాశముందని సమాచారం.
ఎయిర్ఇండియా కొనుగోలుకు ఈఓఐ బిడ్ దాఖలు చేసేందుకు సోమవారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనున్న నేపథ్యంలో టాటా గ్రూప్ బిడ్ దాఖలుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదే రోజు 200 మందితో కూడిన ఎయిర్ఇండియా ఉద్యోగుల గ్రూప్ కూడా సంస్థ కొనుగోలుకు బిడ్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు ఓ ఫినాన్షియర్ మద్ధతు ఉన్నట్లు ఉద్యోగుల గ్రూప్ ప్రకటించింది.
భారీ అప్పుల్లో కూరకుపోయిన కారణంగా ఎయిర్ఇండియాను విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం విదితమే.
ఇదీ చూడండి:డీజిల్ సెగ్మెంట్లోకి మారుతీ రీ ఎంట్రీ!