ETV Bharat / business

ఆ విమాన సంస్థలో 4,300 ఉద్యోగాలు కట్!

కొవిడ్ సంక్షోభంతో మరో దిగ్గజ ఎయిర్​లైన్స్ సంస్థ భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. సింగపూర్ ఎయిర్​లైన్స్ సహా దాని అనుబంధ సంస్థల్లో మొత్తం 4,300 మందిని విధుల నుంచి తప్పించనున్నట్లు వెల్లడించింది.

author img

By

Published : Sep 11, 2020, 11:42 AM IST

SINGAPORE AIRLINES JOBS CUT
సింగపూర్ ఎయిర్​లైన్స్​లో ఉద్యోగాల కోత

కరోనా విజృంభణతో దారుణంగా పతనమైన రంగాల్లో... విమానయానం కూడా ముఖ్యమైంది. కరోనా సంక్షోభం నుంచి తేరుకునేందుకు ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలో సింగపూర్ ఎయిర్​లైన్స్ గ్రూప్​ చేరింది.

ఈ సంస్థ తమ ఉద్యోగుల్లో 4,300 మందిని విధుల నుంచి తప్పించనున్నట్లు పేర్కొంది. కొవిడ్ తర్వాత విమానయాన రంగం గాడిన పడేందుకు చాలా సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

సింగపూర్ ఎయిర్​లైన్స్ సహా దాని అనుబంధ సంస్థ సిల్క్ ఎయిర్, బడ్జెట్ విభాగం స్కూట్​లలో కలిపి ఊ మేరకు కోతలు ఉండనున్నట్లు తెలిపింది.

నియామకాల నిలిపివేత, స్వచ్ఛంద పదవీ విరమణతో.. సంస్థ లే ఆఫ్​లు 2,400లుగా మాత్రమే ఉంటాయని సింగపూర్ ఎయిర్​లైన్స్ వెల్లడించింది. ఇతర విమానయాన సంస్థలతో పోలిస్తే తమ కంపెనీ తీవ్ర సంక్షోభంలో ఉన్నట్లు తెలిపింది.

ఇతర విమానయాన సంస్థలకు ఉన్నట్లు భారీ దేశీయ మార్కెట్ పెద్దగా లేకపోవడం వల్ల భారీ నష్టాలు వస్తున్నట్లు తెలిపింది సింగపూర్ ఎయిర్​లైన్స్. గ్రూప్ సంస్థలు జులై నెలలోనే 820 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకన్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:టిక్​టాక్ డెడ్​లైన్ పొడగించే ప్రసక్తే లేదు: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.