ETV Bharat / business

రిలయన్స్​లో సిల్వర్​ లేక్​ రూ.7,500 కోట్ల పెట్టుబడులు

ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్​ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్​.. రిలయన్స్​ రిటైల్​ వ్యాపారాల్లో 1.75 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఈ మేరకు రూ.7.5 వేల కోట్లు సిల్వర్​ లేక్​ పెట్టుబడులు పెట్టినట్లు రిలయన్స్ వెల్లడించింది.

RELIANCE SILVER LAKE
రిలయన్స్
author img

By

Published : Sep 9, 2020, 10:35 AM IST

రిలయన్స్ రిటైల్​ వ్యాపారాల్లో ప్రముఖ ఈక్విటీ ఫండ్ సంస్థ సిల్వర్​ లేక్​ రూ.7.5 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా 1.75 శాతం వాటాను అమెరికాకు చెందిన ఈ సంస్థ సొంతం చేసుకున్నట్లు రిలయన్స్ వెల్లడించింది.

ఈ ఒప్పందంతో రిలయన్స్ రిటైల్ విలువ రూ.4.21 లక్షల కోట్లకు పెరిగింది.

ఇటీవలే ఫ్యూచర్​ గ్రూప్​ను సొంతం చేసుకున్న రిలయన్స్ సంస్థ ఇప్పుడు.. ఇప్పుడు రిటైల్ వ్యాపారాల్లో వాటాల విక్రయానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సిల్వర్​లేక్, రిలయన్స్ మధ్య చర్చలు జరిగాయి.

ఇప్పటికే సిల్వర్​ లేక్ సంస్థ రిలయన్స్ జియోలో రూ.10,202.55 కోట్లు పెట్టి 2.08 శాతం వాటాను దక్కించుకుంది.

రిటైల్ వ్యాపారాలపై దృష్టి..

ఇటీవల జియో ప్లామ్​లో భారీ మొత్తంలో వాటాలను ఫేస్​బుక్​ సహా ఇతర సంస్థలకు విక్రయించడం ద్వారా దాదాపు రూ.1.4 లక్షల కోట్లకుపైగా రాబట్టింది రిలయన్స్. ఆ తర్వాత ఇప్పుడు రిటైల్ వ్యాపారాలపై దృష్టి సారించింది.

ఇందులో భాగంగా ఫ్యూచర్​ గ్రూప్​ రిటైల్ వ్యాపారాల్లో మెజారిటీ వాటాను రూ.24,713 కోట్లతో ఇటీవలే సొంతం చేసుకుంది. జియో తరహాలోనే రిటైల్ వ్యాపారాల్లోనూ 10 శాతం వరకు వాటాను విక్రయించి భారీగా నిధులు సమకూర్చుకునేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

దేశవ్యాప్త నెట్​వర్క్​..

రిలయన్స్​ రిటైల్​ వెంచర్స్ లిమిటెడ్​లో భాగమైన రిలయన్స్​ రిటైల్​ లిమిటెడ్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 12 వేల రిలయన్స్​ రిటైల్​ స్టోర్లు ఉన్నాయి. సుమారు 64 కోట్ల మంది రిలయన్స్​ స్టోర్లను సందర్శిస్తున్నారని అంచనా.

ఇదీ చూడండి: రిలయన్స్‌ రిటైల్‌కు మరింత 'ఫ్యూచర్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.