ETV Bharat / business

తగ్గిన కరోనా భయాలు- రెండో రోజూ బుల్ జోరు - భారీ లాభాలు

కొవిడ్​-2019 ప్రభావం తగ్గుతుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు బలపడింది. వరుసగా రెండో రోజు బుల్​ జోరుతో సెన్సెక్స్ తిరిగి 40,500 పాయింట్ల పైకి ఎగిసింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది.. 12,200 పైకి చేరింది.

stocks today
స్టాక్ మార్కెట్ వార్తలు
author img

By

Published : Feb 12, 2020, 4:04 PM IST

Updated : Mar 1, 2020, 2:33 AM IST

స్టాక్​ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ లాభాల జోరు కొనసాగింది. కొవిడ్​-2019(కరోనా వైరస్​) ప్రభావం తగ్గుముఖం పడుతున్న వార్తలు అంతర్జాతీయంగా మదుపరుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. ఈ కారణంగా ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ లాభాలను గడించాయి. ఈ సానుకూలతలతో దేశీయ సూచీలు నేడు భారీగా పుంజుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 350 పాయింట్ల వృద్ధితో 41,566 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి.. 12,201 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,672 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,331 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ నేడు 12,232 పాయింట్ల అత్యధిక స్థాయి, 12,144 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

హెచ్​యూఎల్​ 5 శాతం, కోటక్​ బ్యాంక్​ 2.24 శాతం, నెస్లే 1.84 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్​ 1.75 శాతం, ఎం&ఎం 1.45 శాతం లాభాలను గడించాయి.

ఎస్​బీఐ 1.34 శాతం, ఇండస్​ఇండ్ బ్యాంక్​ 1.16 శాతం, సన్​ఫార్మా 0.96 శాతం, అల్ట్రాటెక్​ సిమెంట్​ 0.50 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:కృత్రిమ మేధ కెమెరాలతో 'శాంసంగ్'​ 5జీ స్మార్ట్​ఫోన్లు

Last Updated : Mar 1, 2020, 2:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.