స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. నిన్న నమోదైన లాభాలను సొమ్ము చేసుకునే దిశగా మదుపరులు స్పందించిన కారణంగా.. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి సూచీలు. అ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించిందన్న ప్రకటనతో మిడ్ సెషన్ నుంచి ఒక్క సారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 470 పాయింట్లు క్షీణించింది. చివరకు 36,093 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 136 పాయింట్ల నష్టంతో 10,705 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 36,614 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 35,988 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ నేడు 10,845 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,670 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా మోటార్స్ 1.97 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 0.64 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.58 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.40 శాతం లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ నాలుగు సంస్థలు మాత్రమే లాభపడ్డాయి.
యెస్ బ్యాంకు నేడు అత్యధికంగా 15.52 శాతం నష్టపోయింది. టాటా స్టీల్ 3.66 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.59 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.16 శాతం, మారుతీ 2.55 శాతం, ఎస్బీఐ 2.30 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఎంతంటే?