ETV Bharat / business

SBI net Banking: ఎస్​బీఐ వినియోగదారులకు అలర్ట్​ - sbi yono LIVE

SBI net Banking: ఎస్​బీఐ ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ సేవలకు శనివారం అంతరాయం ఏర్పడనుంది. దాదాపు 5 గంటల పాటు నిలిచిపోనున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించింది.

SBI Internet Banking
ఎస్​బీఐ ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ సేవలకు అంతరాయం
author img

By

Published : Dec 11, 2021, 9:04 AM IST

SBI Net Banking: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్​బీఐ) ఇంటర్నెట్‌ సేవలకు శనివారం కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలతో పాటు యోనో, యోనో లైట్‌, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్‌బీఐ తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువ జామున 4.30 వరకు (300 నిమిషాలు) ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించింది.

SBI internet banking services
ఎస్​బీఐ ట్వీట్​

సాంకేతిక అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్‌బీఐ పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న ఈ అసౌకర్యానికి సహకరించాలని ఖాతాదారులను ఎస్‌బీఐ కోరింది. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి 22వేల బ్యాంక్‌ శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్‌ 8న సైతం ఇదే తరహాలో మెయింటెనెన్స్‌లో భాగంగా ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ సేవలకు కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి: రైల్వేశాఖ వినూత్న నిర్ణయం.. త్వరలో ట్రైన్​ హోస్టెస్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.