ఫిబ్రవరిలో విడుదల చేసిన గెలాక్సీ ఏ 10, ఏ 30, ఏ 50 స్మార్ట్ ఫోన్లు భారీగా అమ్ముడైనట్లు శామ్సంగ్ వెల్లడించింది. కేవలం 40 రోజుల్లో 20 లక్షల ఏ సిరీస్ ఫోన్లు విక్రయించి రూ. 3,500 కోట్లు ఆర్జించినట్లు తెలిపింది.
భారత్లోని మెట్రో నగరాలు సహా చిన్న పట్టణాల నుంచి వచ్చిన భారీ స్పందనే ఇందుకు కారణమని శామ్సంగ్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు రాంజీవ్జిత్ సింగ్ తెలిపారు.
'ఏ' సిరీస్ ఫోన్ల అమ్మకాల ద్వారా ఈ ఏడాది రూ.28,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాంజీవ్జిత్ వెల్లడించారు. ప్రస్తుతం వచ్చిన భారీ స్పందనతో కంపెనీ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారాయన.
వచ్చే వారంలో మరో మూడు 'ఏ' సిరీస్ స్మార్ట్ ఫోన్లు (గెలాక్సీ ఏ70, ఏ 80, ఏ2 ) విడుదల చేయనున్నట్లు తెలిపారు.
భారత్ స్మార్ట్ ఫోన్ల విపణిలో చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం 'షామీ' నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది శామ్సంగ్.