ETV Bharat / business

'ఎన్​ఫీల్డ్'​ బైకుల్లో లోపం- 2.36 లక్షల యూనిట్లు రీకాల్​!

తమ బైకుల్లో సాంకేతిక లోపం గుర్తించినట్లు రాయల్​ ఎన్​ఫీల్డ్ ప్రకటించింది. దీంతో వివిధ మోడళ్లలోని 2.36 లక్షల యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. రీకాల్ చేస్తున్న బైకుల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసిన యూనిట్లు కూడా ఉన్నట్లు వెల్లడించింది.

Defect in Royal Enfield
రాయల్ ఎన్​ఫీల్డ్ బైకుల్లో లోపం
author img

By

Published : May 19, 2021, 5:33 PM IST

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​ భారీ రీకాల్​ ప్రకటించింది. మీటియర్​, క్లాసిక్​, బుల్లెట్ వంటి మోడళ్ల ఇగ్నీషన్ కాయిల్​లో సాంకేతిక లోపాన్ని గుర్తించడమే.. రీకాల్​కు కారణంగా వెల్లడించింది. మొత్తం 2,36,966 యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది.

భారత్​ సహా.. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, థాయ్​లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, మలేసియా వంటి దేశాలకు ఎగుమతి చేసిన యూనిట్లను కూడా రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.

2020 డిసెంబర్​ నుంచి 2021 ఏప్రిల్ ఉత్పత్తి అయిన మీటియర్​, ఈ ఏడాది జనవరి- ఏప్రిల్​ మధ్య విక్రయమైన క్లాసిక్​, బుల్లెట్​ మోడళ్లలో ఈ లోపం గుర్తించినట్లు రాయల్​ ఎన్​ఫీల్డ్ పేర్కొంది. ఇతర మోడళ్లలో సమస్యలు లేవని స్పష్టం చేసింది.

లోపాలు ఉన్న బైక్​లు కొన్న వినియోగదారులను తమ డీలర్​షిప్​ ప్రతినిధులే సంప్రదిస్తారని రాయల్​ ఎన్​ఫీల్డ్ తెలిపింది. వినియోగదారులు కూడా దగ్గర్లోని డీలర్​షిప్​లను సంప్రదించడం ద్వారా తమ బైక్​లో లోపం ఉందో లేదో తెలుసుకోవచ్చని వివరించింది.

ఇదీ చదవండి:బజాజ్, టాటా వాహనదారులకు గుడ్​న్యూస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.