ETV Bharat / business

జియో గిగా ఫైబర్​ లాంఛ్​... అంబానీ స్పీచ్​లో కీలకాంశాలు

రిలయన్స్​ వార్షిక సర్వసభ్య సమావేశం..
author img

By

Published : Aug 12, 2019, 10:44 AM IST

Updated : Sep 26, 2019, 5:42 PM IST

13:24 August 12

అదిరే ఫీచర్లు, సూపర్​ ఆఫర్లతో 'జియో గిగా ఫైబర్​'

బ్రాడ్​బ్యాండ్​, డీటీహెచ్​ రంగంలో సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేసింది రిలయన్స్​ జియో. మార్కెట్​ వర్గాలు, టెలికాం వినియోగదారులు.. ఇలా దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన 'జియో గిగా ఫైబర్​' సేవలపై స్పష్టతనిచ్చింది. ముంబయిలో జరిగిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు సంస్థ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ. 

బ్రాడ్​బ్యాండ్​, డీటీహెచ్​, ల్యాండ్​లైన్​ సేవలన్నింటినీ ఒకే దగ్గర అందించే 'జియో గిగా ఫైబర్​' వాణిజ్య సేవలను ఈ ఏడాది సెప్టెంబర్​ 5న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సామాన్య ప్రజలందరికీ అందుబాటు ధరలలో రూ. 700- 10, 000 మధ్య సేవలు లభ్యమవుతాయని వెల్లడించారు. కనిష్ఠంగా 100 ఎంబీపీఎస్​ నుంచి గరిష్ఠంగా 1 జీబీపీఎస్​ వరకు వేగంతో డేటా అందుతుందని చెప్పారు. 

  • జియో గిగా ఫైబర్​ వాణిజ్య సేవలు ప్రారంభం-సెప్టెంబర్​ 5
  • కనీస ప్రారంభ ధర.. రూ. 700
  • గరిష్ఠ ధర.. రూ. 10,000
  • వేగం.. 100 ఎంబీపీఎస్​ నుంచి 1 జీబీపీఎస్​ వరకు
  • ప్రారంభ ధర.. రూ. 700

రిలయన్స్​ జియో 340 మిలియన్​ వినియోగదారుల మార్కును చేరిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు అంబానీ. 

హెచ్​డీ టీవీ, సెట్​ టాప్​ బాక్స్​​ ఉచితం...

జియో గిగా ఫైబర్​ సేవల కింద అనేక ఆఫర్లు ప్రకటించారు అంబానీ. జియో వెల్​కమ్​ ఆఫర్​ కింద సెట్​టాప్​ బాక్స్​ సహా ఫుల్​ హెచ్​డీ టీవీ ఉచితంగా లభిస్తాయని తెలిపారు. అయితే.. ఇందుకోసం ఏడాది చందాను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. హెచ్​డీ టీవీ వద్దనుకుంటే హోం కంప్యూటర్​ లేదా 4కే సెట్​టాప్​ బాక్స్​ అందిస్తామని తెలిపారు. 

జియో సెట్​టాప్​ బాక్స్​ ద్వారా వీడియో కాల్​ సేవలు అందించనుంది రిలయన్స్​ జియో. రూ. 500తో ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా వీడియో కాల్ సేవలు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 

వచ్చే జనవరి నుంచి ఐఓటీ...

2020 జనవరి నుంచి ఇంటర్​నెట్​ ఆఫ్​ థింగ్స్​(ఐఓటీ) సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆర్​ఐఎల్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ. వచ్చే రెండేళ్లలో 2 బిలియన్​ వినియోగదారులకు ఈ ఐఓటీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. 

ఫలితాల్లో ముందంజ...

రిలయన్స్​ ఇండస్ట్రీస్​, రిలయన్స్​ జియో... ఇంకా అనుబంధ సంస్థలన్నీ మంచి ఫలితాలతో దూసుకెళ్తున్నాయన్నారు అంబానీ. సంస్థ ప్రగతి, ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికల్ని ఏజీఎం వేదికగా వాటాదారులతో పంచుకున్నారు. 

గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ రికార్డ్ సృష్టించిందని ప్రకటించారు. రిలయన్స్​ రిటైల్​ రూ. లక్షా 30 వేల కోట్ల వ్యాపారం చేసిందని వెల్లడించారు. భారత దేశంలో అత్యధిక పన్నులు చెల్లించిన సంస్థగా ఆర్​ఐఎల్​ నిలిచిందని గుర్తుచేశారు.

సౌదీ అరాంకోతో అతిపెద్ద ఒప్పందం...

పెట్రో కెమికల్స్​ రంగంలో.. సౌదీ అరాంకోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏజీఎంలో ప్రకటించారు అంబానీ. దాదాపు 20 శాతం పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యం అని వెల్లడించారు రిలయన్స్​ ఛైర్మన్​.

ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు ముకేశ్​. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వ పాలన సాగుతుందని తెలిపారు. దేశం అభివృద్ది పథంలో దూసుకెళ్లేందుకు ఇదే సరైన సమయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 కల్లా భారత్ 10 వేల ట్రిలియన్​ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుందని అంచనా వేశారు. 

12:04 August 12

100 ఎంబీపీఎస్​ నుంచి 1 జీబీపీఎస్​ వరకు డేటా సేవలు

రిలయన్స్​ జియో గిగా ఫైబర్​ సేవలు సెప్టెంబర్​ 5నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపిన ముకేశ్​ అంబానీ.. రూ. 700-10,000 మధ్య ధరలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. జియో ద్వారా 100 ఎంబీపీఎస్​ నుంచి 1 జీబీపీఎస్​ వరకు డాటా ఇస్తున్నట్లు తెలిపారు. 

  • యూఎస్‌లో ఇంటర్నెట్‌ వేగం సగటు 90 ఎంబీపీఎస్‌.
  • జియో ద్వారా 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు ఇస్తున్నాం.
  • జియో సేవలు నెలకు రూ.700 నుంచి రూ.10 వేల వరకు ఉంటాయి
  • నెలకు రూ.500 కు ప్రపంచంలో ఎక్కడికైనా వీడియోకాల్‌ సేవలు
  • కొత్త చిత్రాలు విడుదలైన రోజే తమ ఇంట్లోనే వీక్షించే సౌకర్యం.
  • ఫస్ట్‌డే ఫస్ట్‌షో పేరిట కొత్త చిత్రాలు ఇంట్లో నుంచే వీక్షించే సదుపాయం
  • మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ సేవలు మీ ఇంటివద్దనే అందిస్తాం
  • జియో సేవల ధరల వివరాలు సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులో ఉంచుతాం
  • వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని అమలులోకి తెస్తాం.

11:57 August 12

సెప్టెంబర్​ 5 నుంచే జియో ఫైబర్​ సేవలు

  • RIL Chairman and Managing Director, Mukesh Ambani: Starting 5th September, we are launching Jio Fibre services commercially across India. pic.twitter.com/rr0o2WVg0l

    — ANI (@ANI) August 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలయన్స్​ జియో గిగా ఫైబర్​ సేవలపై స్పష్టత నిచ్చారు ముకేశ్​ అంబానీ. దేశవ్యాప్తంగా సెప్టెంబర్​ 5 నుంచి జియో ఫైబర్​ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రజలందరికీ అందుబాటు ధరలో రూ. 700 నుంచి 10 వేల మధ్య జియో ఫైబర్​ సేవలు వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. 

11:35 August 12

ఫలితాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్​ ఇండస్ట్రీస్​: ముకేశ్​

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు సంస్థ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ. రిలయన్స్​ ఇండస్ట్రీస్​, రిలయన్స్​ జియో, రిలయన్స్​ అనుబంధ సంస్థలన్నీ అద్భుత ఫలితాలతో దూసుకెళ్తున్నాయని ప్రకటించారు. సంస్థ ప్రగతిని, భవిష్యత్​ ప్రణాళికను ఈ సందర్భంగా వాటాదారులతో పంచుకున్నారు అంబానీ. 

2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్​ రికార్డు సృష్టించిందన్నారు ముకేశ్​. రిలయన్స్​ రిటైల్​ రూ. లక్షా 30 వేల కోట్ల బిజినెస్​ చేసిందని ప్రకటించారు. భారత దేశంలో రిలయన్స్​ అత్యధిక పన్నులు చెల్లించిన సంస్థగా నిలిచిందని పేర్కొన్నారు. వాటాదారులను ఉద్దేశించి.. సంస్థ ప్రగతిపై అనుభవాలు పంచుకున్నారు. 

సౌదీ అరాంకోతో అతిపెద్ద ఒప్పందం...

పెట్రో కెమికల్స్​ రంగంలో.. సౌదీ అరాంకోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏజీఎంలో ప్రకటించారు ముకేశ్​. దాదాపు 20 శాతం పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యం అని వెల్లడించారు రిలయన్స్​ ఛైర్మన్​.

ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు ముకేశ్​. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వ పాలన సాగుతుందని తెలిపారు. దేశం అభివృద్ది పథంలో దూసుకెళ్లేందుకు ఇదే సరైన సమయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 

త్వరలో అంతటా బ్రాడ్​బ్యాండ్​...

రిలయన్స్​ జియో త్వరలో బ్రాడ్​బ్యాండ్​ సేవలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. జియో 340 మిలియన్ల వినియోగదారుల మార్కును చేరిందన్నారు. వచ్చే రెండేళ్లలో 2 బిలియన్​ వినియోగదారులకు ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​(ఐఓటీ) అందిస్తామని తెలిపారు. 2020 జనవరి నుంచి ఐఓటీ సేవలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇంటింటికీ బ్రాడ్​బ్యాండ్​ సేవలు 2018 ఆగస్టులోనే మొదలుపెట్టామని తెలిపారు. 5 లక్షల గృహాలకు ఇప్పటికే బ్రాడ్​బ్యాండ్​ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. 

11:29 August 12

జియోతో డేటా వెలుగుల దేశంగా భారత్​

రిలయన్స్​ జియో గురించి వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు అంబానీ. సెప్టెంబర్​ 5 నాటికి  జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుందని తెలిపారాయన. జియోకు ముందు డేటా డార్క్​గా ఉన్న దేశం.. ఇప్పుడు డేటా వెలుగులతో నిండిందని పేర్కొన్నారు. ప్రతి నెలా 10 మిలియన్ల మంది జియోలో భాగస్వామ్యమవుతున్నారన్నారు. 

అంబానీ ప్రసంగంలో ముఖ్యాంశాలు...

  • జియోను ఆదరించిన భారతీయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
  • అత్యధిక నెట్‌వర్క్‌గా జియో.. ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది.
  • జియో బ్రాడ్‌బ్యాండ్‌ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది. 
  • ఈ ఆర్థిక సంవత్సరం ఐవోటీని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం.
  • ఇంటింటికీ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు అందిస్తాం.

11:23 August 12

పెట్రో కెమికల్స్​లో సౌదీ అరాంకోతో ఒప్పందం: అంబానీ

పెట్రో కెమికల్స్​లో సౌదీ అరాంకోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ముకేశ్​ అంబానీ తెలిపారు. రిలయన్స్​ పెట్రో కెమికల్స్​లో ఆ సంస్థ 20 శాతం పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యమని స్పష్టం చేశారు.  ప్రతిఒక్కరికి డిజిటల్‌ నెట్‌వర్క్‌ సౌకర్యం అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యమని తెలిపారు. పెట్రో కెమికల్స్​ కింద రూ.5.7 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందన్నారు అంబానీ. 

11:18 August 12

'2030 కల్లా 10 వేల ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్​'

రిలయన్స్​ ఏజీఎంలో ప్రసంగిస్తున్నారు ముకేశ్​ అంబానీ. 2030 కల్లా భారత్​ 10 వేల ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అంబానీ. నరేంద్ర మోదీ నేతృత్వంలో.. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని తెలిపారు. భారత్​ అభివృద్ది పథంలో దూసుకెళ్లేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు. రిలయన్స్​ జియో 340 మిలియన్ల వినియోగదారులను దాటిందని ఏజీఎంలో  ప్రకటించారు అంబానీ. 

11:13 August 12

రిలయన్స్​ రిటైల్​ రూ. లక్షా 30 వేల కోట్ల వ్యాపారం

వినియోగదారు రిటైల్​ మార్కెట్​లో రిలయన్స్​ జియో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు ముకేశ్​ అంబానీ. ప్రపంచంలో అత్యధిక వేగంగా డిజిటల్​ ప్లాట్​ఫాం గా అవతరించిందని పేర్కొన్నారు. 

అంబానీ ప్రసంగం...

  • రిలయన్స్‌ రిటైల్‌ రూ.లక్షా 30 వేల కోట్ల బిజినెస్‌ చేసింది.
  • భారత ఆర్థిక వ్యవస్థలో సంస్థ భాగస్వామ్యం చాలా ఉంది.
  • భారత్‌లో రిలయన్స్‌ అత్యధికంగా పన్నులు చెల్లించింది.

11:11 August 12

వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తున్న ముకేశ్​ అంబానీ

రిలయన్స్​ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. వాటాదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ. గతేడాది అత్యధిక లాభాలు పొందిన సంస్థగా రిలయన్స్​ రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు అంబానీ. 

వినియోగదారు మార్కెట్‌లో జియో రిటైల్‌ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి: ముకేశ్​

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిజిటల్‌ మార్కెట్ కంపెనీగా ఎదిగింది: ముకేశ్​

10:50 August 12

గిగా ఫైబర్ ప్రత్యేకతలు ఇవే..

జియో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, టీవీతో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌, డీటీహెచ్​ సేవలు అందించడం దీని ప్రత్యేకత. ల్యాండ్​లైన్ సేవల కారణంగా.. ప్రస్తుతం సిగ్నల్ సమస్య ఉన్న ప్రాంతాలకూ కాలింగ్ సమస్య తీరనుంది. గ్రామాలకూ అంతర్జాల సేవలందించడం సులభం కానుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్, ల్యాండ్​లైన్​ సేవలు ఒకే కనెక్షన్​పై అందుబాటులో ఉన్నా.. టీవీ కోసం మరో కనెక్షన్​ తీసుకోక తప్పడం లేదు. జియో గిగా ఫైబర్ అందుబాటులోకి వస్తే... మూడు సేవలు ఒకే కనెక్షన్​తో లభ్యం కానున్నాయి.

'గిగా ఫైబర్' అందుబాటులోకి వస్తే.. ఈ సేవలపై ప్రస్తుతం ఉన్న చార్జీల మోత తగ్గనుంది. జియో 4జీ రాకతో డేటా చార్జీలు దిగొచ్చినట్లే.. ఇతర సంస్థలూ తమ టారీఫ్​లను మార్చుకోవాల్సి వస్తోంది.

10:27 August 12

సెప్టంబర్​ 5 నుంచి దేశవ్యాప్తంగా గిగా ఫైబర్​

రిలయన్స్ జియో.. మరో సంచలనానికి సిద్ధమైంది. జియో 4జీ తర్వాత.. ప్రతిష్ఠాత్మకంగా ఆవిష్కరించిన 'గిగా ఫైబర్' సేవలపై నేడు స్పష్టత రానుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న... జియో మాతృసంస్థ రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం)లో దీనిపై ప్రకటన వెలువడనుంది. 11 గంటలకు సమావేశమవనుంది ఏజీఎం. 

దాదాపు ఏడాది నిరీక్షణ తర్వాత.. డీటీహెచ్​, టీవీ, ల్యాండ్​లైన్​ మూడింటినీ ఒకే దగ్గర పొందే ప్రత్యేక సేవలపై అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రిలయన్స్​ భేటీపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

ఇదీ చూడండి: 'గిగా ఫైబర్' జైత్రయాత్ర ప్రారంభం నేడే!

AP Video Delivery Log - 0200 GMT News
Monday, 12 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0149: US TX Bulletproof Backpacks AP Clients Only 4224654
US shootings give rise to bullet-proof backpacks
AP-APTN-0059: Pakistan Kashmir Appeal Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4224649
Wife of Kashmir leader appeals for UN intervention
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.