ETV Bharat / business

అబుదాబిలో రిలయన్స్​ పెట్టుబడులు

author img

By

Published : Jun 30, 2021, 6:52 AM IST

యూఏఈలో ఏర్పాటు చేయనున్న ఓ భారీ పెట్రోరసాయన కేంద్రంలో రిలయన్స్​ ఇండస్ట్రీస్(ఆర్​ఐఎల్​)​ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఒప్పందంపై ఆర్​ఐఎల్​ సంతకాలు చేసింది.

Reliance
రిలయన్స్

యునైటెడ్​ అరబ్​ ఎమిరెట్స్​(UAE) ఏర్పాటు చేయనున్న ఓ భారీ పెట్రోరసాయన కేంద్రంలో ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందంపై సంతకాలు చేసింది. పశ్చిమ అబుదాబిలో 'రువాయిస్​ డెరివేటివ్స్​ పార్క్​'ను అభివృద్ధి చేయడానికి ఆ దేశ ప్రభుత్వ ఇంధన దిగ్గజం అబుదాబి నేషనల్ ఆయిల్​ కో(యాడ్​నాక్​), ప్రభుత్వ హోల్డింగ్​ కంపెనీ ఏడీక్యూలు కలిసి ఇటీవల ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ 'తాజిజ్​'లో రిలయన్స్ కూడా భాగస్వామి కానుంది. ఈ ప్రాజెక్టులో 1.5 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.11,250 కోట్లు) వరకు ఆర్​ఐఎల్​ పెట్టుబడులు పెట్టవచ్చని సమాచారం.

ఏకీకృత ప్లాంటులో భారీ ఉత్పత్తి

ఒప్పందం కింద తాజిజ్​, రిలయన్స్​ కలిసి ఏటా 9,40,000 టన్నుల క్లోర్​-ఆల్కలి, 1.1 మిలియన్​ టన్నుల ఎథిలీన్​ డౌక్లోరైడ్​, 3,60,000 టన్నుల పీవీసీని ఉత్పత్తి చేసే ఒక ఏకీకృత(రిఫైనరీ, పెట్రోరసాయనాలు) ప్లాంటును ఏర్పాటు చేస్తాయి.

ఇది మాకు గర్వకారణం

"యాడ్​నాక్​తో మా దీర్ఘకాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్​కు అవసరమైన పీవీసీలో ఉపయోగించే ఎథిలీన్​ డౌక్లోరైడ్​ను ఉత్పత్తి చేస్తాం. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులో భాగస్వాములం కావడం గర్వంగా ఉంది."

- ఆర్​ఐఎల్​ అధిపతి ముకేశ్​ అంబానీ

ఇదీ చూడండి: 70 కోట్ల లింక్డ్​ఇన్ యూజర్ల డేటా లీక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.