ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. హైడ్రోకార్బన్ డివిజిన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా.. విధించిన వేతనాల కోతలను చెల్లించేందుకు సిద్ధమైంది. పర్ఫార్మెన్స్ బోనస్‌ను కూడా ఇవ్వనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
కరోనా కాలంలో పని చేసేందుకు మంచి సంకేతంగా.. వచ్చే ఏడాది వేతనం నుంచి 30 శాతం అడ్వాన్స్‌గా రిలయన్స్ ఇవ్వనున్నట్లు.. ఈ విషయంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు.
వేతనాల కోత ఇలా..
కరోనా నేపథ్యంలో వ్యాపారం దెబ్బతిన్న కారణంగా.. హైడ్రోకార్బన్ విభాగ ఉద్యోగులకు 10 నుంచి 50 శాతం వరకు వేతనాల్లో కోత విధించింది. సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తన పూర్తి వేతనాన్ని వదులుకోవడాని అంగీకారం తెలిపారు. ఇదే సమయం నుంచి వార్షిక బోనస్‌లు, పనితీరు ఆధారిత పోత్సాహకాలు ఇవ్వడాన్ని కూడా ఆపేసింది.
ఇదీ చూడండి:ఎల్టీసీ క్యాష్ ఓచర్లపై ఆర్థిక శాఖ స్పష్టత