టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీర్ఘకాలిక కాలావధి కలిగిన ప్లాన్ కోరుకునే వారి కోసం దీన్ని ప్రకటించింది. 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ధరను రూ.2,121గా నిర్ణయించింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన 2020 ప్లాన్‌ను ఇది పోలి ఉంది.
![Reliance Jio](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6154510_jio.jpg)
2,121 ప్లాన్ కింద వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. జియో నుంచి జియో, ల్యాండ్ లైన్‌కు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియోయేతర కాల్స్ మాట్లాడుకోవడానికి 12వేల నిమిషాలు అందిస్తున్నారు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఈ ప్లాన్ కింద లభిస్తుంది. జియో యాప్‌తో పాటు, గూగుల్‌పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్‌లోనూ ఈ ప్లాన్ లభ్యమవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా జియో ప్రకటించిన 2020 ప్లాన్ సైతం ఇవే ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ ఆ ప్లాన్ వ్యాలిడిటీని 365 రోజులుగా ప్రకటించింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ కింద ఈ ప్లాన్‌ను జియో అందించింది.