వినియోగదారులకు మరింత మెరుగైన 4జీ సేవలను అందించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ అంతటా 20 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను అదనంగా జోడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియోకు ఇప్పటి వరకు ఉన్న 40 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం లభ్యత ఇప్పుడు 50 శాతం పెరిగి 60 మెగాహెర్ట్జ్ వరకు చేరుకుంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఇటీవల నిర్వహించిన వేలంలో, ఏపీ టెలికాం సర్కిల్ కోసం 850 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 5 హెర్ట్జ్ ; 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 5 హెర్ట్జ్ ; 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 10 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను జియో చేజిక్కించుకుంది. ఈ అదనపు స్పెక్ట్రంను రెండు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న తన అన్ని టవర్ సైట్‌లలో జియో విజయవంతంగా అనుసంధానం చేసింది.
ఫలితంగా, ఈ ప్రాంతంలోని వినియోగదారులందరికీ ఇక నుంచి మరింత మెరుగైన వేగవంతమైన 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. నెట్‌వర్క్ సామర్థ్యం 50 శాతం పెరగడం సహా పాటు డేటా వేగం కూడా రెట్టింపు కానుంది. ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి:టూల్‌కిట్ వివాదం- ట్విట్టర్‌కు కేంద్రం వార్నింగ్!