ETV Bharat / business

సోనీ కార్ప్​లో వయాకామ్ 18 విలీనం లేనట్లే! - సోనీతో వయకామ్ డీల్​ విరమించుకున్న రిలయన్స్

సోనీ పిక్చర్స్​లో.. తమ మీడియా వ్యాపారాలను విలీనం చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్​ఐఎల్​). దీనికి బదులు డిజిటల్ కంటెంట్ రూపొందించేందుకు పెట్టుబడులు పెట్టాలని ఆర్​ఐఎల్​ భావిస్తున్నట్లు సమాచారం.

Reliance, sony corp deal calls off
వయకామ్ 18 విలీనాన్ని విరమించుకున్న రిలయన్స్
author img

By

Published : Oct 6, 2020, 5:02 AM IST

ఎంటర్​టైన్మెంట్ వ్యాపారాలను సోనీ పిక్చర్స్​​లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ విరిమించుకుంది. వ్యూహాత్మక పునరాలోచనలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రిలయన్స్​కు మెజారిటీ వాటా ఉన్న వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్​ను.. జపాన్​కు చెందిన సోనీ కార్ప్​లో విలీనం చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలోనూ రిలయన్స్ మెజారిటీ వాటాదారుగా అవతరించేది.

అయితే ఇప్పుడు..విలీనానికి బదులు డిజిటల్ కంటెంట్​ రూపకల్పనకు పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తుల ద్వారా తెలిసింది. ముఖ్యంగా జియో డిజిటల్ వ్యాపారాలకు డిజిటల్ మీడియా, ఎటర్​టైన్మెంట్ విభాగాలు తప్పనిసరిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.

ఓటీటీ సేవల్లో అగ్రగామిగా నిలిచేందుకు పెట్టుబడులు పెట్టడం సహా ఇతర ప్రొడక్షన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకూ రిలయన్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:లండన్​లో ఓలా క్యాబ్​ సేవలకు బ్రేకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.