ETV Bharat / business

ఆర్బీఐ శుభవార్త.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ - గృహ రుణం

ఈ ఏడాది వరుసగా ఐదో సారి రెపో రేటు తగ్గించింది రిజర్వు బ్యాంకు. నేడు ముగిసిన మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో గృహ, వాహన రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత తగ్గనుంది.

ఆర్బీఐ
author img

By

Published : Oct 4, 2019, 12:52 PM IST

పండుగ ముందు భారతీయ రిజర్వు బ్యాంకు శుభవార్త ప్రకటించింది. అందరూ అంచనా వేసినట్లుగానే ఈ ఏడాది వరుసగా ఐదో సారి(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో సారి) రెపో రేటు తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ నేతృత్వంలో.. ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశం అనంతరం వడ్డీ రేటులో 25 బేసిస్ పాయింట్లు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆర్బీఐ.. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ (రెపో రేటు) 5.15 శాతానికి చేరింది. రివర్స్ రెపో రేటును (బ్యాంకులు ఆర్బీఐకి ఇచ్చే రుణాలపై వడ్డీ) 4.90 శాతంగా నిర్ణయించింది ఆర్బీఐ. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 135 బేసిస్​ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గించింది ఆర్బీఐ.

వడ్డీ కోతతో ఎవరెవరికి ఊరట?

గృహ, వాహన రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత తగ్గనుంది. రెపో కోత ఫలాలను.. రుణ గ్రహీతలకు నేరుగా అనుసంధానం చేసే విధానం ఈ నెల నుంచే ప్రారంభమైంది.

వృద్ధి ఆందోళనకరం..

రెపో రేటు తగ్గించినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. 2020-21లో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి ఉంటుందని అంచనా వేసింది.

ఇదీ చూడండి: గూగుల్​లో వ్యక్తిగత గోప్యత మరింత పటిష్ఠం!

Patna (Bihar), Oct 04 (ANI): Many parts of Bihar including capital Patna which are battling flood situation saw fresh rainfall flooding the streets again. Heavy downpour led to streets being waterlogged in several parts of Patna. Patna's Patliputra Colony and Rajendra Nagar continued to reel under impact of flood. NDRF teams continued rescue operation in the flood-affected areas of Patna, as the natural disaster threw normal life out of gear. According to reports, 73 people have died in rain-related incidents in the state till now.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.