ETV Bharat / business

వృథా ఖర్చు చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే - Uses of early invest

నెలవారీగా చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం ఎంతవరకు ఉపయోగపడతుందన్న అంశంపై చాలామందికి అనుమానాలుంటాయి. 20 ఏళ్ల వయసులోనే ఎక్కువ మందికి ఉద్యోగం వచ్చినప్పటికీ మొదట్లో పొదుపు చేయరు. కొంత కాలం అయ్యాక ప్రారంభిస్తారు. అయితే తొందరగా పెట్టుబడి ప్రారంభించడం ఎంత అవసరం? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి? ఆలస్యంగా ప్రారంభించిన వారికొచ్చే రాబడితో పోల్చితే ముందుగానే పెట్టుబడి పెట్టినవారికి ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది?

power of investing early
వృథా ఖర్చు చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే
author img

By

Published : Mar 19, 2020, 11:14 AM IST

సాధారణంగా 20 పదుల వయసులో చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగంలో చేరుతుంటారు. ఉద్యోగం రాగానే విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. పొదుపు, పెట్టుబడులపై శ్రద్ధ వహించరు. కొన్ని సంవత్సరాల తర్వాత పెట్టుబడి ప్రారంభిస్తారు. అయితే ఆ సమయంలో వీరు ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ.. అంతకంటే తక్కువ మొత్తంలో నెలవారీగా ముందు నుంచే పెట్టుబడి పెట్టిన వారితో పోల్చితే వచ్చే రిటర్న్​ల్లో వ్యత్యాసం భారీగానే ఉంటుంది.

తక్కువ పెట్టుబడి అయినా రిటర్న్​లు అధికమే

ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులకు 20 సంవత్సరాల వయసులో ఉద్యోగం వచ్చిందనుకోండి. అందులో ఒకరు... మొదటి నెల నుంచి రూ.2వేలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టారనుకోండి. మరో వ్యక్తి మొదటి మూడు సంవత్సరాలు డబ్బును వృథాగా ఖర్చు చేసిన అనంతరం మొదటి వ్యక్తి కంటే ఎక్కువగా రూ.2500 పెట్టుబడి పెట్టారనుకుందాం. వీరిరువురూ 14 శాతం వార్షిక రాబడినిచ్చే సాధానంలో మదుపు చేశారనుకుంటే..

ఆ ఇద్దరు వ్యక్తులు.. తమకు 45 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకున్నట్లయితే మొదటి వ్యక్తి రూ.54.55 లక్షలు.. రెండో వ్యక్తి రూ. 44.17 లక్షలు పొందుతారు. కేవలం మూడు సంవత్సరాల వ్యత్యాసంతోనే మొదటి వ్యక్తి 11.28 లక్షలు ఎక్కువగా సంపాదించారు. అంతేకాకుండా ఆ ఇద్దరు పెట్టుబడిని అలానే కొనసాగించినప్పటికీ 30 సంవత్సరాల్లో ఇద్దరి రిటర్న్​ల్లో 20 లక్షలకు పైగా తేడా ఉంది. మ్యూచువల్ ఫండ్లలో సంవత్సరంలో వచ్చిన రాబడిని మళ్లీ పెట్టటం ద్వారా మొత్తంమీద ఆదాయంలో తేడాలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. దీన్నే కాంపౌండింగ్ ప్రభావం అని అంటారు.

రిస్క్ తీసుకోవచ్చు

రిటర్న్​ల పరంగా కాకుండా వేతనం అందినప్పటి నుంచి వీలైన మొత్తంలో పెట్టుబడి, పొదుపు చేయటం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. అంతేకాకుండా కొంత కాలం తరువాత అత్మవిశ్వాసం పెరగినందున పెట్టుబడిని పెంచుకోవచ్చని ఆర్థిక ప్రణాళిక నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఎక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టి ఎక్కువ రిటర్న్​లు పొందొచ్చు.

యుక్త వయస్సులో పెట్టుబడులు పెట్టినప్పుడు రిస్క్ తీసుకునే వీలుంటుంది. అదే ఆలస్యంగా ప్రారంభించినట్లయితే రిస్క్ తీసుకోవడం తగ్గిపోతుంటుంది. తొందరగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లయితే భవిష్యత్తులో ధీమాగా ఉండొచ్చు. పిల్లల చదువులు, రిటైర్మెంట్ లాంటికి ముందుస్తు ప్రణాళిక వేసుకోవచ్చు.

ఇదీ చూడండి : చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గింపు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.