ETV Bharat / business

గూగుల్​కు పోటీగా పేటీఎం యాప్​ స్టోర్ - పేటీఎం మిని యాప్​ స్టోర్ విశేషాలు

గూగుల్​తో ఇటీవలి వివాదం తర్వాత డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గూగుల్ ప్లే స్టోర్​కు పోటీగా.. ఆండ్రాయిడ్​ మినీ యాప్​ స్టోర్​ను సోమవారం ఆవిష్కరించింది.

Paytm launches Android Mini App Store
గూగుల్​కు పోటీగా పేటీఎం యాప్​స్టోర్
author img

By

Published : Oct 5, 2020, 4:37 PM IST

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం గూగుల్​తో పోటీకి దిగింది. గూగుల్​ ప్లే స్టోర్​కు పోటీగా ఆండ్రాయిడ్ మినీ యాప్​ స్టోర్​ను ఆవిష్కరించినట్లు సోమవారం ప్రకటించింది. భారత డెవలపర్లు.. తమ యాప్​లను సులభంగా ప్రజలకు చేరువ చేసేందుకు మినీ యాప్​ స్టోర్​ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

వివాదం నుంచి యాప్​ స్టోర్ వరకు..

జూదానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘన కారణంతో.. ప్లే స్టోర్​ నుంచి కొన్ని గంటలపాటు ఇటీవల పేటీఎం యాప్​ను తొలగించింది గూగుల్. ఈ అంశంపై పేటీఎం, గూగుల్ మధ్య పరస్పర వాదనలు కూడా జరిగాయి. ఈ పరిణామం జరిగిన కొన్ని వారాల్లోనే పేటీఎం మినీ యాప్​ స్టోర్​ను ఆవిష్కరించడం గమనార్హం.

పేటీఎం మినీ యాప్​ స్టోర్ విశేషాలు..

ఎలాంటి ఛార్జీలు లేకుండానే మినీ యాప్ స్టోర్​లో లిస్టింగ్, పంపిణీ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు పేటీఎం వివరించింది. డెవలపర్లు తమ యూజర్లకు పేటీఎం వాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ, నెట్​ బ్యాంకింగ్, కార్డ్స్ సదుపాయం కల్పించేందుకు వీలున్నట్లు పేర్కొంది.

ఓలా, పార్క్+, రాపిడో, నెట్​మెడ్స్, ఐఎంజీ, డోమినోస్ సహా 300లకు పైగా సంస్థలు మినీ ప్రోగ్రామ్​లో ఇప్పటికే భాగస్వామ్యమైనట్లు తెలిపింది పేటీఎం.

ఇదీ చూడండి:పేటీఎం x గూగుల్.. వయా ఐపీఎల్ క్యాష్​ బ్యాక్!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.