ETV Bharat / business

బీఎస్ఎన్​ఎల్​ వీఆర్​ఎస్ దరఖాస్తులు​ @77,000 - బిజినెస్​ వార్తలు తెలుగు

బీఎస్​ఎన్​ఎల్​ స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులు 77 వేలు దాటాయి. వ్యయాలు తగ్గించుకునేందుకు తీసుకువచ్చిన ఈ పథకం 2020 జనవరి 1 నుంచి అమలు కానుంది. వీఆర్​ఎస్​ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని డిసెంబర్​ 3గా నిర్ణయించింది బీఎస్​ఎన్​ఎల్​.

బీఎస్​ఎన్​ఎల్ వీఆర్​ఎస్​
author img

By

Published : Nov 19, 2019, 7:04 PM IST

ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్​ఎన్​ఎల్​ తమ ఉద్యోగులకు ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి భారీ స్పందన వస్తోంది. వీఆర్​ఎస్​ కోసం ఇప్పటివరకు 77,000 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు బీఎస్​ఎన్​ఎల్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం 2020 జనవరి 1 నుంచి అమలు కానున్నట్లు చెప్పారు.

బీఎస్​ఎన్ఎల్​​లో ఉన్న మొత్తం లక్షా 50 మంది ఉద్యోగుల్లో.. లక్ష మంది వీఆర్​ఎస్​కు అర్హులని ఆ సంస్థ ఇదివరకే ప్రకటించింది.

వీఆర్ఎస్ ఎందుకంటే..?

భారీ అప్పుల్లో కూరుకుపోయిన బీఎస్​ఎన్​ఎల్​, ఎంటీఎన్​ఎల్​ సంస్థలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.69,000 కోట్ల భారీ ప్యాకేజి ప్రకటించింది. వ్యయాలు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మొత్తం రూ.7,000 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వ అంచనా. ఈ పథకానికి మొత్తం 80,000 మంది దరఖాస్తు చేసుకుంటారని బీఎస్​ఎన్​ఎల్​ భావిస్తోంది.

బీఎస్​ఎన్​ఎల్​తో పాటే మరో ప్రభుత్వరంగ సంస్థ ఎంటీఎన్​ఎల్​కూ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ సంస్థ తమ ఉద్యోగుల నుంచి వీఆర్ఎస్​​కు దరఖాస్తులు స్వీకరిస్తోంది.

రెండు సంస్థల్లోని ఉద్యోగులు వీఆర్ఎస్​కు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 3ను చివరి తేదీగా నిర్ణయించాయి.

వీఆర్​ఎస్​ ఎక్స్​గ్రేషియా లెక్క..

వీఆర్ఎస్​కు అర్హత కలిగిన ఉద్యోగులు.. వారు పని చేసిన ప్రతి ఏడాదికి 35 రోజుల చొప్పున, మిగిలిన ఉద్యోగ సంవత్సరాలకు 25 రోజుల చొప్పున ఎక్స్​గ్రేషియా పొందుతారు.

ఇదీ చూడండి: స్పెక్ట్రం రుసుము వసూలు అనైతికం: టెలికాం నిపుణులు

SHOTLIST:
RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
TVNZ - NO ACCESS NEW ZEALAND
Auckland - 19 November 2019
1. Britain's Prince Charles and his wife Camilla rub noses with New Zealand officials in traditional Maori hongi welcome
2. Various of traditional Maori haka ceremony
3. Various of Charles inspecting guard of honour
NZ POOL - NO ACCESS NEW ZEALAND
Auckland - 19 November 2019
4. Charles meeting with New Zealand Prime Minister Jacinda Ardern
STORYLINE:
UK'S PRINCE CHARLES WELCOMED IN NEW ZEALAND
Britain's Prince Charles and his wife Camilla met with New Zealand Prime Minister Jacinda Ardern on Tuesday.
The meeting, in the capital Auckland, came on the third day of their tour of New Zealand.
Charles and Camilla greeted officials at Government House by rubbing noses, the traditional Maori hongi welcome.
They then watched a haka welcoming ceremony.  
Ardern said earlier that she expected to talk with the prince about his interest in New Zealand’s environmental work, including plans to plant one billion trees.
She deflected questions on whether she intended to discuss the future role of the monarchy in New Zealand.
Queen Elizabeth II remains New Zealand’s constitutional head of state, although these days it’s largely a ceremonial role.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.