ETV Bharat / business

2.5 ట్రిలియన్ డాలర్లకు ఆన్​లైన్ రిటైల్ సేల్స్!

ఇటీవల ఆన్ని అవసరాలకు ఆన్​లైన్​ వేదికలను వాడటం భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కొత్తగా చాలా మంది ఆన్​లైన్​లో కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆన్​లైన్ 2024 నాటికి ఆన్​లైన్ రిటైల్ విక్రయాల విలువ ఆసియా ప్రాంతంలోనే 2.5 ట్రిలియన్ డాలర్లు దాటే అవకాశముందని ఓ సర్వే ద్వారా తెలిసింది.

online retails sale in India
ఆన్​లైన్ రిటైల్ విక్రయాల లెక్కలు
author img

By

Published : Sep 18, 2020, 5:58 PM IST

కరోనా నేపథ్యంలో చాలా మంది ఇంటికి కావాల్సిన నిత్యావసరాలను ఆన్​లైన్​లో కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 నాటికి ఆసియా ఆన్​లైన్ విక్రయాలు 2.5 ట్రిలియన్ డాలర్లు దాటొచ్చని ప్రముఖ మార్కెట్ విశ్లేషణ సంస్థ ఫొర్రెస్టర్​ అంచనా వేసింది. 2019లో ఈ విలువ 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. 2024 నాటికి ఆన్​లైన్ రిటైల్ వార్షిక వృద్ధి రేటు 11.3 శాతంగా నమోదవ్వచ్చని పేర్కొంది.

కరోనా వల్ల నిత్యావసరాలకు ఆన్​లైన్ పోర్టల్​ల వాడకం భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆన్​లైన్​లో గ్రోసరీ కొనుగోళ్లు 30 శాతం పెరినట్లు అంచనా. ఆన్​లైన్​లో కొత్తగా కొనుగోళ్లు జరిపేవారు 2020లో 5.1 శాతం.. 2024 నాటికి 10.6 శాతం పెరగొచ్చని సర్వే పేర్కొంది.

"2019 లెక్కల ప్రకారం రిటైల్ అమ్మకాల్లో గ్రోసరీ విభాగం వాటా 35 శాతంగా ఉంది. అయితే అందులో ఆన్​లైన్ రిటైల్ వాటా 6 శాతం మాత్రమే. అందుకే రిటైలర్లకు ఇది కీలకమైన విభాగంగా మారొచ్చు. ఫలితంగా ఆన్​లైన్ ​రిటైల్ విక్రయాల వృద్ధికి తోడ్పడొచ్చు. ఆన్​లైన్ గ్రోసరీ రిటైల్ విక్రయాల విలువ 2024 నాటికి 559 బిలియన్ డాలర్లకు పెరగొచ్చు. "

- సతీశ్​ మీనా, ఫొర్రెస్టర్ సీనియర్​ విశ్లేషకులు

సర్వేలోని మరిన్ని విషయాలు..

  • భారత్​లో ఆన్​లైన్​లో గ్రోసరీ కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి.
  • గ్రోసరీ రిటైల్ వ్యాపారాల్లో.. ఫ్యూచర్​ గ్రూప్​ను రిలయన్స్ రిటైల్స్ కొనుగోలు చేయడం కీలక పరిణామం.
  • గ్రోసరీ రిటైల్​ పరంగా 2019-20లో రిలయన్స్ రిటైల్ ఆదాయం రూ.346 బిలియన్లుగా ఉంది. ఫ్యూచర్​ రిటైల్ వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరం రూ.100 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
  • ఫేస్​బుక్​తో కుదుర్చుకున్న భాగస్వామ్యంతో ఆన్​లైన్ రిటైల్ గ్రోసరీ వ్యాపారాల్లో రిలయన్స్ మార్కెట్ లీడర్​గా ఎదగొచ్చని పలు నివేదికలు అప్పట్లో అంచనా వేశాయి.
  • వచ్చే ఐదేళ్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విభాగాల్లో గ్రోసరీ కూడా ఒకటిగా ఉండనుంది.
  • కరోనా వల్ల ఆన్​లైన్ కొనుగోళ్లు పెరిగాయి. ఇదే సమయంలో ఆదాయం తగ్గడం వల్ల వినియోగదారులు వెచ్చించే మొత్తాలు తగ్గాయి.
  • ఆన్​లైన్ రిటైల్ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరి.. 2024 నాటికి 50 శాతం మార్కెట్ వాటాతో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండే అవకాశముంది.
  • ఐరోపా, అమెరికాకు భిన్నంగా ఆసియా ప్రాంతంలో స్మార్ట్​ఫోన్ల ద్వారానే ఎక్కువగా ఆన్​లైన్ కొనుగోళ్లు జరుగుతాయి.

ఇదీ చూడండి:U, V కానేకాదు.. ఇది 'K-షేప్' రికవరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.