ETV Bharat / business

కరోనా తర్వాత ఆన్​లైన్​లో కార్ల విక్రయాల జోరు!

కరోనా కారణంగా ఇటీవల వాహన విక్రయాలు స్తంభించిపోయాయి. సంక్షోభం అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయోననే భయాలు పరిశ్రమ వర్గాల్లో ఉన్నాయి. అయితే సంక్షోభం తర్వాత వాహన విక్రయాలు భారీగా పెరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆన్​లైన్​ అమ్మకాలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడైంది.

CAR SALES IN ONLINE HIKE
సంక్షోభం తర్వాత ఆటోమొబైల్​ రంగం జోరు
author img

By

Published : May 3, 2020, 4:27 PM IST

కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత ఆన్​లైన్​లో కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఓ నివేదికలో తెలిపింది. వైరస్ సంక్రమణ, శుభ్రత భయాలతో ఎక్కువ మంది ఇటీవల సొంత వాహనాల వినియోగానికి మొగ్గుచూపుతున్నారని వెల్లడించింది. ముఖ్యంగా ఇతరులు లేకుండా సొంత వాహనంలో సురక్షితంగా ప్రయాణాలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ పరిణామం ఇటీవల రికార్డు స్థాయిలో పడిపోయిన కార్ల అమ్మకాలు అదే స్థాయిలో పెరిగేందుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

అన్నింటికీ ఆన్​లైన్​...

కరోనా కారణంగా చాలా అవసరాలకు ఆన్​లైన్ వేదికను వినియోగిస్తున్నారు. కార్ల కొనుగోలు విషయంలోనూ అదే తీరు కనిపించొచ్చని ఎర్నెస్ట్ అండ్ యంగ్ పేర్కొంది. వీటికి తోడు రిటైల్ స్టోర్లవద్ద కార్ల కొనుగోలుకు వినియోగదారులు సంకోచిస్తుండటం కూడా ఆన్​లైన్ మార్కెట్​ వృద్ధికి దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడింది.

ఇందుకోసం వాహన రిటైలర్లు.. వినియోగదారులకు సులభంగా ఆన్​లైన్​లో కొనుగోళ్లకు అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. చైనాలో నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాలు తెలిసినట్లు వెల్లడించింది.

భారత్​లోనూ అదే తీరు..

భారత్​లోనూ చాలా మంది ఆన్​లైన్​లో వాహనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో తేలింది. అయితే చాలా మందికి ఆన్​లైన్ కొనుగోళ్లపై ఆసక్తి ఉన్నా.. అవగాహన లేకపోవడం వల్ల వెనక్కి తగ్గుతున్నట్లు తెలిసింది. ఈ కారణంగా ఆన్​లైన్​ వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు పేర్కొంది.

ఆటో మొబైల్​ సంస్థలకు కూడా ఆన్​లైన్​లో అమ్మకాలు పెంచుకునేందుకు ఇది సరైన సమయమని సర్వే అభిప్రాయపడింది. అయితే భవిష్యత్​లో ఆన్​లైన్ అమ్మకాలు సర్వసాధారణం కావచ్చని.. ఇందులో భాగంగా వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో వస్తున్న మార్పులను గ్రహిస్తూ.. పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఇదీ చూడండి:ఐటీ రీఫండ్​ కోసం ఆశపడితే మోసపోవడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.