ETV Bharat / business

రిలయన్స్ రైట్స్ ఇష్యూలో అంబానీలకు 5.52 లక్షల షేర్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్​లో ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వాటాలు స్వల్పంగా పెంచుకున్నారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్​ ఇష్యూకు రాగా అందులో ముకేశ్ అంబానీ సహా ఆయన భార్యా పిల్లలు 5.52 లక్షల షేర్లు దక్కించుకున్నారు. దీనితో సంస్థలో వారి వాటాలు 75 లక్షల నుంచి 80.52 లక్షలకు పెరిగాయి.

Ambanis rised their shares in Reliance
రిలయన్స్​లో పెరిగిన అంబానీల వాటా
author img

By

Published : Jun 11, 2020, 5:13 PM IST

ఇటీవలే ముగిసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూలో సంస్థ అధినేత ముకేశ్ అంబానీ 5.52 లక్షల షేర్లను దక్కించుకున్నారు. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఈ విషయం పేర్కొంది రిలయన్స్ ఇండస్ట్రీస్​. తాజాగా దక్కించుకున్న షేర్లతో రిలయన్స్​లో ముకేశ్​ అంబానీ వ్యక్తిగత వాటా 75 లక్షల షేర్ల నుంచి నుంచి 80.52 (0.12) లక్షల షేర్లకు పెరిగింది.

రిలయన్స్ తెలిపిన కీలకాంశాలు..

  • ముకేశ్ భార్య నీతా అంబానీ, ఆయన కూతురు ఇషా, కొడుకులు ఆకాశ్​, అనంత్​లూ కూడా ఈ ఇష్యూలో 5.52 లక్షల వాటాలు దక్కించుకున్నారు. సంస్థలో వీరందరి వ్యక్తిగత వాటాలు కూడా 80.52 లక్షలకు పెరిగాయి.
  • సంస్థ ప్రమోటర్​ గ్రూప్ మొత్తం 22.50 కోట్ల షేర్లు దక్కించుకుంది. దీనితో సంస్థలో ప్రమోటర్​ గ్రూపు వాటా 50.07 శాతం నుంచి 50.29 శాతానికి పెరిగింది.
  • పబ్లిక్ షేర్​హోల్డింగ్​ వాటా 49.93 శాతం నుంచి 49.71 శాతానికి తగ్గింది.
  • ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్​ఐసీ ఈ రైట్స్​ ఇష్యూలో 2.47 కోట్ల షేర్లు సబ్​స్క్రైబ్​ చేసుకుంది. దీనితో రిలయన్స్​లో ఎల్​ఐసీ వాటా 6 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రిలయన్స్​లో ఎల్​ఐసీఐకి 37.18 కోట్ల షేర్లు ఉన్నాయి.
  • పబ్లిక్ షేర్​హోల్డర్లు ఈ ఇష్యూలో 19.74 కోట్ల షేర్లను దక్కించుకున్నారు.

ఇదీ చూడండి:ఎంఎస్​ఎంఈలకు 9 రోజుల్లో రూ.12,201 కోట్ల రుణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.