ETV Bharat / business

'జీవనకాల గరిష్ఠానికి ఫ్లిప్​కార్ట్​, ఫోన్​పే నెలవారీ యూజర్లు'

కరోనా కాలంలోనూ వాల్​మార్ట్ విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్​తో ముగిసిన మూడు నెలల కాలానికి అంతర్జాతీయ వ్యాపారాల నికర విక్రయాలు 29.6 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు వాల్​మార్ట్ ప్రకటించింది. అనుబంధ సంస్థలైన ఫ్లిప్​కార్ట్, ఫోన్​పేలలో నమోదైన బలమైన వృద్ధి ఇందుకు కారణంగా తెలిపింది.

Monthly active users for Flipkart at all-time high
పండుగ సీజన్​లో ఫ్లిప్​కార్ట్​లో పెరిగిన విక్రయాలు
author img

By

Published : Nov 18, 2020, 1:39 PM IST

రిటైల్ దిగ్గజం వాల్​మార్ట్​కు​ అంతర్జాతీయ వ్యాపారాల్లో విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్​తో ముగిసిన త్రైమాసికానికి నికర విక్రయాలు.. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 1.3 శాతం వృద్ధితో 29.6 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ప్రకటించింది.

'బిగ్​ బిలియన్ డే సేల్స్​'తో.. ఫ్లిప్​కార్ట్, ఫోన్​​పేలలో నెలవారీ యాక్టివ్ యూజర్లు జీవనకాల గరిష్టానికి చేరడం, కెనడా, మెక్సికోల్లో వ్యాపారాల్లో నమోదైన విక్రయాల వృద్ధి ఇందుకు కలిసొచ్చినట్లు వాల్​మార్ట్ తెలిపింది.

విక్రయాలపై కరోనా ప్రభావం పడినప్పటికీ.. అక్టోబర్​తో ముగిసిన మూడు నెలల కాలానికి వాల్​మార్ట్​ ఆదాయం 134.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 6.7 బిలియన్ డాలర్లు (5.2 శాతం) ఎక్కువ.

వ్యాపార విస్తరణ..

వ్యాపార కార్యకలాపాలను పెంచుకునేందుకు.. వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని పెట్టుబడి సంస్థల బృందం నుంచి జులైలో 1.2 బిలియన్‌ డాలర్ల నిధులను ఫ్లిప్‌కార్ట్‌ సమీకరించింది. ఆ తర్వాత అరవింద్​ యూత్​ బ్రాండ్​ను రూ.260 కోట్లకు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్​ లిమిటెడ్​లో రూ.1,500 కోట్లతో 7.8 శాతం వాటాను కొనుగోలు చేయండం తెలిసిందే.

ఇదీ చూడండి:పోకో నుంచి మరో బడ్జెట్​ ఫోన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.