ETV Bharat / business

పీఎంసీ కుంభకోణంలో రూ.3,830 కోట్లు సీజ్​

పీఎంసీ కుంభకోణంలో భారీగా ఆస్తులను సీజ్​ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్​డీఐఎల్​, డైరెక్టర్లు, ప్రమోటర్లు, పీఎంసీ అధికారులకు చెందిన రూ.3,830 కోట్లు గుర్తించినట్లు వెల్లడించింది.

author img

By

Published : Oct 14, 2019, 9:34 PM IST

money ceased by ed in pmc bank fraud

పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు మనీలాండరింగ్ కుంభకోణంలో భారీగా ఆస్తులను సీజ్​ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్. హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ (హెచ్​డీఐఎల్​) సహా దాని డైరెక్టర్లు, ప్రమోటర్లు, పీఎంసీ బ్యాంకు అధికారులకు చెందిన ఆస్తులను లెక్కిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

ఈ ప్రక్రియలో రూ.3,830 కోట్లను సీజ్​ చేసినట్లు తెలిపారు. గుర్తించిన ఆస్తులను అక్రమ నగదు చలామణీ నిరోధక చట్టం కింద త్వరలోనే జప్తు చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ కేసు..

పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్​ డెవలప్​మెంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా పీఎంసీ బ్యాంక్​ నుంచి హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు రూ.6,500కోట్లు కాజేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు స్టాక్​మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

New Delhi, Oct 14 (ANI): On being asked about the steps taken by Finance Ministry to safeguard depositors of Punjab and Maharashtra Co-operative (PMC) Bank, Union Minister of Finance Nirmala Sitharaman said, "I have had word with the Governor of Reserve Bank on the PMC matter because eventually, it is Reserve Bank-appointed resolution professional, who is going to deal with it. The RBI repeatedly has assured me, even today the Governor has assured me that he'll keep the interest of customers in mind and at the earliest try to resolve it as he goes on. You also know that ED has confiscated quite a lot of property." She further said, "The fact remains that the government has been on its toes in terms of bringing the assets of promoters of the bank"
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.