ప్రైవేట్ దిగ్గజం కరూర్ వైశ్యా బ్యాంకు తమ వినియోగదారులకు బీమా సేవలు అందించేందుకు డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వివరాలు సహా ఆర్థిక, మందగమనం వంటి అంశాలను ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా పంచుకున్నారు ఆ బ్యాంకు ఎండీ, సీఈఓ పీఆర్ శేషాద్రి.
ప్రస్తుతం కనిపిస్తున్న ఆర్థిక మందగమనాన్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తుందని.. అయితే అది సాధారణంగా వచ్చే వృద్ధి మందగమనమేనంటున్నారు శేషాద్రి.
"మేము డిజిట్ ఇన్సూరెన్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. దీని ద్వారా వారి బీమా ఉత్పత్తులన్నీ మా వినియోగదారులకు అందిస్తాము. డిజిట్ అనేది టెక్నాలజీ అధారంగా పని చేస్తున్న బీమా సంస్థ. డిజిట్ బీమాతో కలిసి పని చేయడం ద్వారా వారి బీమా ఉత్పత్తులన్నీ మా వినియోగదారులకు అందుతాయని ఆశిస్తున్నాం.
మాలో చాలమంది దగ్గర ఆర్థిక వృద్ధి మందగమనం ఏ స్థాయిలో ఉందనే సమాచారం లేదు. ఇంత మొత్తంలో క్షీణత ఉందని పలు సంస్థలు అంటున్నాయి. కొన్ని రంగాల్లో మందగమనం ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే సాధారణంగా ఏప్రిల్ నుంచి దాదాపు సెప్టెంబర్ వరకు మందగమనం ఉంటుంది. ఇప్పుడు అందులో పీక్ సీజన్ నడుస్తోంది. దీనికి సంబంధించి.. తమ దగ్గరున్న నిజమైన సమాచారం కన్నా ఎక్కువగా మీడియా ప్రచారం చేస్తోంది. అయితే త్వరలో పండుగ సీజన మొదలవుతుంది. ఫలితంగా త్వరలో అర్థిక వృద్ధి పుంజుకుంటుందని ఆశిస్తున్నాం."
- పీఆర్ శేషాద్రి, కరూర్వైశ్యా బ్యాంకు ఎండీ
ఇదీ చూడండి: మన రోడ్లపై పెరుగుతున్న లగ్జరీ కార్ల రయ్ రయ్