ETV Bharat / business

మారుతీ మరో ఘనత.. 2 కోట్ల వాహనాలు విక్రయం!

ప్యాసింజర్​ వాహనాల విక్రయాల్లో 'మారుతీ సుజుకీ ఇండియా' మరో మైలురాయి దాటింది. 37 ఏళ్ళలో 2 కోట్ల ప్యాసింజర్​ వాహనాలను విక్రయించినట్లు ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

author img

By

Published : Nov 30, 2019, 7:40 PM IST

Updated : Nov 30, 2019, 8:40 PM IST

maruti-crosses-20-mn-passenger-vehicle-sales-mark
మారుతీ మరో ఘనత.. 2 కోట్ల వాహనాలు విక్రయం!

దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ ఇండియా' మరో రికార్డు సాధించింది. దేశీయ విపణిలో ప్యాసింజర్​ వాహనాల అమ్మకాలు 2 కోట్ల మార్క్​ను దాటినట్లు ప్రకటించింది.

దాదాపు 37 ఏళ్ల కాలంలో ఈ ఘనతను సాధించినట్లు ఆ సంస్థ పేర్కొంది. 'మారుతీ 800'తో భారత్​లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మారుతీ సుజుకీ. ఈ సంస్థ తొలి కారును 1983 డిసెంబర్​ 14న విక్రయించింది.

కోటి ప్యాసింజర్​ వాహనాల విక్రయానికి 29 ఏళ్ల సమయం పట్టిందని.. కేవలం 8 ఏళ్ల సమయంలోనే మరో కోటి వాహనాలు విక్రయించి.. 2 కోట్ల మార్క్​ను అందుకున్నట్లు పేర్కొంది మారుతీ సుజుకీ ఇండియా.

ఫ్యాక్టరీలో తయారైన.. సీఎన్​జీ వాహనాలతో పాటు.. స్మార్ట్​ హైబ్రిడ్​ వాహనాలను, 8 బీఎస్ ​6 మోడళ్లను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ కెనిచీ అయూకవా తెలిపారు.

సుజుకీ మోటార్స్​ కార్పొరేషన్​ నుంచి చిన్న సైజు.. విద్యుత్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు కెనిచీ.

ఇదీ చూడండి:మోటొ 'పాప్​-అప్​ సెల్ఫీ' ఫోన్.. మార్కెట్లోకి ఎప్పుడంటే?

Moscow (Russia), Nov 30 (ANI): Russian military cadets sung 'Ae watan, humko teri kasam' song at an event in Russia's Moscow. The video was shared by the Indian Army.

Last Updated : Nov 30, 2019, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.