కియా మోటర్స్ ఇండియా కీలక మైలురాయిని అందుకుంది. దేశంలో తొలి ఉత్పత్తిని ప్రవేశపెట్టిన 10 నెలల్లోపే కనెక్టెడ్ ఫీచర్ కార్ల అమ్మకాల్లో 50వేల మార్క్‌ను దాటింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది సంస్థ.
"సెల్టోస్, కార్నివాల్ మోడల్స్ వంటి కనెక్టెడ్ కార్ల అమ్మకాల్లో సంస్థ 50 వేల మార్క్‌ను దాటింది. మా కస్టమర్లకు కొత్త ఆవిష్కరణలు, తదుపరి జనరేషన్ సాంకేతికతను అందించేందుకు మా బలమైన సంకల్పం, నిరంతర కృషి వల్లే ఈ మైలురాయిని సాధించగలిగాం. మా సంస్థ సరికొత్త యూవీఓ కనెక్టెడ్ టెక్నాలజీ భారత్‌లోని కార్ల యజమానుల్లో కీలక మార్పు తీసుకొచ్చింది. కొత్త సెల్టోస్, త్వరలో రానున్న సొనెట్ కార్లలో అప్డేటెడ్ యూవీఓ సాంకేతికతను తీసుకొస్తున్నాం. దీని ద్వారా డ్రైవింగ్ మరింత సురక్షితంగా, సులభంగా, అనుకూలంగా ఉండనుంది."
- కూఖ్యున్ షిమ్, కియా మోటర్స్ ఇండియా ఎండీ, సీఈఓ