ETV Bharat / business

బాయ్​కాట్​ చైనా: డ్రాగన్​తో ఆ కంపెనీ బంధం కట్! - చైనా దిగుమతులు నిలిపేయనున్న జేఎస్​డబ్ల్యూ

చైనా దిగుమతులను రానున్న రెండేళ్లలో పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధమైంది జేఎస్​డబ్ల్యూ గ్రూప్. గల్వాన్ వద్ద భారత సైనికులపై చైనా బలగాలు చేసిన అక్రమ దాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

boycott china gains Indian firms Support
బాయ్​కాట్ చైనాకు జెఎస్​డబ్ల్యూ మద్దతు
author img

By

Published : Jul 2, 2020, 5:20 PM IST

బాయ్​కాట్ చైనా ఉద్యమానికి సాధారణ పౌరులతో పాటు దేశీయ కంపెనీల నుంచీ మద్దతు పెరుగుతోంది. ఇందులో భాగంగానే దేశీయ పారిశ్రామిక దిగ్గజం జెఎస్​డబ్ల్యూ గ్రూప్ చైనా దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది.

తమ గ్రూప్​ చెందిన కంపెనీలు చైనా నుంచి ప్రస్తుతం ఏడాదికి 400 మిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో వీటిని సున్నాకు తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని జేఎస్​డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్​ పార్థ్ జిందాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

  • The unprovoked attack by the Chinese on Indian soil on our brave jawaans has been a huge wake up call and a clarion call for action - we @TheJSWGroup have a net import of $400mn from China annually and we pledge to bring this down to zero in the next 24 months #BoycottChina

    — Parth Jindal (@ParthJindal11) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గల్వాన్​ లోయలో చైనా బలగాలు భారత సైనికులపై చేసిన అక్రమ దాడికి.. ఇదే సరైన చర్యగా పేర్కొన్నారు పార్థ్. భారత జవాన్లపై చైనా బలగాల అక్రమ దాడి.. భారతీయులందరికీ ఒక మేల్కొలుపులాంటిదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:నిషేధంతో టిక్​టాక్​కు రూ.45 వేల కోట్ల నష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.