ETV Bharat / business

100 నిమిషాలు, 100 ఎస్​ఎంఎస్​లు ఫ్రీ: జియో - లాక్​డౌన్​

లాక్​డౌన్​ కారణంగా రీఛార్జ్​ చేసుకోవడం ఇబ్బందిగా మారుతుందని భావించిన జియో.. తన వినియోగదారుల కోసం ఓ ఆఫర్​ ప్రకటించింది.​ 100నిమిషాల టాక్​టైమ్​, 100ఎస్​ఎంఎస్​లు ఉచితంగా ఇస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపింది. రీఛార్జి చేయకున్నా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించింది.

Jio offers 100minutes of free Talktime 100 free SMS to help poor in lockdown
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ 100 నిమిషాలు 100 ఎస్​ఎంఎస్​లు ఉచితం: జియో
author img

By

Published : Mar 31, 2020, 8:47 PM IST

Updated : Mar 31, 2020, 10:00 PM IST

వినియోగదారులకు ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైమ్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా ఇస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. మహమ్మారి కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. చాలాచోట్ల దుకాణాలు తెరవకపోవడంతో రీఛార్జి చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో జియో వినియోగదారులందరికీ ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రీఛార్జి చేయకున్నా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయం కల్పిస్తున్నామని ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

ట్రాయ్​ సూచనలతో..

Jio offers 100minutes of free Talktime 100 free SMS to help poor in lockdown
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ 100 నిమిషాలు 100 ఎస్​ఎంఎస్​లు ఉచితం: జియో

'ఈ అత్యవసర సమయంలో జియో ఫోన్‌ వినియోగదారులందరికీ 10 రెట్ల ప్రయోజనాలు. 100 నిమిషాల కాల్స్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందజేస్తున్నాం' అని జియో ట్వీట్‌ చేసింది. టెలికాం సంస్థలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల దుకాణాలు తెరిచే అవకాశం లేదని ట్రాయ్‌ తెలిపింది. వినియోగదారులందరూ ఆన్‌లైన్‌లో రీఛార్జి చేసుకోలేరు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల గడువును పెంచాలని టెలికాం ఆపరేటర్లను కోరింది.

కేవలం పేదలకే

ట్రాయ్‌ సూచన మేరకు సోమవారం ఎయిర్‌టెల్‌ తమ 8 కోట్ల వినియోగదారులకు కాలపరిమితిని ఏప్రిల్‌ 17 వరకూ పొడిగించింది. పది రూపాయాల టాక్‌టైమ్‌ను జత చేసింది. వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ సైతం ఇదే ఆఫర్‌ను ప్రకటించినా కేవలం పేద వర్గాలకు మాత్రమే ఇస్తామని తెలిపింది.

ఇదీ చూడండి: ఈఎంఐ కట్టాలా లేదా?... క్లారిటీ ఇచ్చిన బ్యాంకులు

Last Updated : Mar 31, 2020, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.