రిలయన్స్ జియో సంస్థ పండుగల వేళ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం రూ.1500గా ఉన్న జియో ఫోన్‌ను దసరా, దీపావళి పండగల సందర్భంగా రూ.699 ప్రత్యేక ధరకు విక్రయించనున్నట్లు వెల్లడించింది.
షరతులేవీ లేకుండా ఈ ప్రత్యేక ధరతో రూ.800 ఆదా చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది జియో. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 2జీ మొబైల్స్‌తో పోల్చుకుంటే జియో ఫోన్ ధర చాలా తక్కువ. దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ తీసుకువచ్చినట్లు జియో పేర్కొంది. దేశంలో 35 కోట్ల 2జీ వినియోగదారులు ఉండగా వారిని 4జీ దిశగా మళ్లించి అందరికీ డిజిటల్ పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
ఈ ఆఫర్ ద్వారా జియోలో చేరిన వారికి రూ.700 విలువైన డేటా ప్రయోజనాలను అందించనున్నట్లు వెల్లడించింది రిలయన్స్. తొలి ఏడు రీఛార్జిలకు అదనంగా రూ.99 విలువైన డేటా అందించనుంది. ఫోన్‌పై రూ.800తో పాటు డేటాపై రూ.700 వరకు మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చని తెలిపింది జియో.
ఇదీ చూడండి: సెప్టెంబర్‌లో అత్యల్ప జీఎస్టీ వసూళ్లు