ETV Bharat / business

వినియోగదారులకు ఇక బ్యాంకులే ఫైన్​ కడతాయి!

అన్ని రకాల ఆన్​లైన్​లైన్​ లావాదేవీలకు భరోసానిస్తూ ఆర్బీఐ దృఢమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రకమైన లావాదేవీల్లో సాంకేతిక సమస్యల వల్ల డబ్బు స్తంభిస్తే.. వినియోగదారుడికి నష్టం కలగకుండా కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. రీఫండ్​ల విషయంలో బ్యాంకులు జాప్యం చేస్తే.. వినియోగదారుడికి నష్టపరిహారం కింద రోజుకు రూ.100 చెల్లించాలని తేల్చిచెప్పింది ఆర్బీఐ.

ఆర్బీఐ
author img

By

Published : Sep 21, 2019, 1:04 PM IST

Updated : Oct 1, 2019, 10:56 AM IST

ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాల దగ్గర కార్డుతో చెల్లింపులు, ఆన్‌లైన్‌లో నగదు బదిలీ సందర్భాల్లో.. లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం ఇబ్బంది పెడుతోంది. ఖాతాలో నగదు డెబిట్‌ అయినా ఏటీఎం నుంచి రాకపోవడం, ఆన్‌లైలో బదిలీ చేసినప్పుడు మన ఖాతాలో డబ్బు కట్‌ అయి అవతలి వ్యక్తికి జమకాకపోవడం వంటి సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ సమస్యలపై వినియోగదారుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో.. వాటి పరిష్కారానికి ఆర్బీఐ కచ్చితమైన మార్గదర్శకాలు జారీచేసింది.

ఏటీఎం, కార్డ్‌ స్వైప్‌, కార్డు ద్వారా నగదు బదిలీ, ఐఎంపీఎస్‌, యూపీఐ, ఆధార్‌, నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌, వాలెట్స్‌ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు.. మన ఖాతా నుంచి డబ్బు కట్‌ అయి అవతలి వ్యక్తి, సంస్థకు చేరకపోతే నిర్దిష్ట గడువులోగా మళ్లీ నగదు మన ఖాతాకు చేరాలి. గడువు దాటితే.. వినియోగదారునికి రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ఏ లావాదేవీ అయినా ఫెయిల్‌ అయినప్పుడు 1-5 రోజుల్లోపు ఆ మొత్తం తిరిగి ఖాతాదారునికి చేరాల్సిందేనని తేల్చిచెప్పింది. కమ్యూనికేషన్‌ ఫెయిల్యూర్‌, నగదు లభ్యత లేకపోవడం, టైం అవుట్‌ సెషన్స్‌ లాంటి వైఫల్యాలను వినియోగదారులపై రుద్దకుండా ఆ బాధ్యతను బ్యాంకులే మోయాలని పేర్కొంది. దేశీయంగా జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టంచేసింది.

ఈ కొత్త నిబంధనలు అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానున్నాయి. గరిష్ఠ గడువు తర్వాత కూడా సమస్య తీరకపోతే, వినియోగదారులు రిజర్వ్‌బ్యాంక్‌ ఆధ్వర్యంలోని బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మెన్‌కి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది.

ఆర్బీఐ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు..

  • ఏటీఎం: వినియోగదారు ఖాతా నుంచి డబ్బు కట్‌ అయినా ఏటీఎం నుంచి నగదు రాకపోతే లావాదేవీ జరిపిన రోజు నుంచి 5 రోజుల్లోపు ఆ నగదు వినియోగదారుడి ఖాతాలోకి చేరాలి. లేకపోతే ఆరో రోజు నుంచి రోజుకు రూ.100 చొప్పున ఖాతాదారునికి నష్టపరిహారం కింద బ్యాంకు జమచేయాలి.
  • కార్డ్‌ నుంచి కార్డ్‌కు నగదు బదిలీ: కార్డ్‌ నుంచి నగదు డెబిట్‌ అయి అటువైపు లబ్ధిదారుని ఖాతాలో జమకాకపోతే ఆ నగదు ఒక రోజులోపు వాపస్‌రావాలి. లేకపోతే ఆ మరుసటి రోజు నుంచి రోజుకు రూ.100 జరిమానా కట్టాలి.
  • పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌): కార్డు స్వైప్‌ చేసినప్పుడు డబ్బు డెబిట్‌ అయి మర్చెంట్‌ లొకేషన్‌ నుంచి కన్ఫర్మేషన్‌ రాకపోతే (ఛార్జిస్లిప్‌ జనరేట్‌కాకపోతే) అయిదురోజుల్లోపు ఆ డబ్బు ఖాతాదారునికి ఆటోమేటిక్‌గా జమకావాలి లేకపోతే ఆరో రోజు నుంచి ఖాతాదారుకు రోజుకు రూ.100 జరిమానా చెల్లించాలి.
  • ఇ కామర్స్‌ ద్వారా చేసిన లావాదేవీలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.
  • ఇమిడియట్‌ పేమెంట్‌ సిస్టం (ఐఎంపీఎస్‌): డబ్బు డెబిట్‌ అయి అటువైపు వ్యక్తి ఖాతాలో జమకాకపోతే ఆ డబ్బు ఒకరోజులోపు ఆటోమేటిక్‌గా వాపస్‌ రావాలి లేదంటే మరుసటిరోజు నుంచి రోజుకు రూ.100 జరిమానా
  • యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులకూ అదే వర్తిస్తుంది. ఖాతా నుంచి నగదు డెబిట్‌ అయి మర్చెంట్‌ లొకేషన్‌ నుంచి ధ్రువీకరణ రాకపోతే అయిదురోజుల్లోపు నగదు ఆటోమేటిక్‌గా వాపసురావాలి. లేదంటే ఆరో రోజు నుంచి రోజుకు రూ.100 జరిమానా
  • ఆధార్‌ ఆధారిత చెల్లింపులు: ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయి మర్చెంట్‌ లొకేషన్‌ నుంచి కన్ఫర్మేషన్‌ రాకపోతే 5 రోజుల్లోపు ‘క్రెడిట్‌ అడ్జెస్ట్‌మెంట్‌’ చేయాలి. లేదంటే అయిదురోజుల తర్వాత రోజుకు రూ.100 చెల్లించాలి.
  • ఖాతా నుంచి డెబిట్‌ అయిన సొమ్ము అవతలి వైపున్న లబ్ధిదారు ఖాతాలోకి జమకాకపోయినా ఇదే వర్తిస్తుంది. ఆధార్‌ చెల్లింపులు జరిపినప్పుడు లబ్ధిదారుని ఖాతాలో డబ్బు జమకావడం ఆలస్యమైతే బెనిఫిషియరీ బ్యాంకు ఒక రోజులోపు ఆ మొత్తాన్ని వాపస్‌ చేయాలి. లేదంటే ఒకరోజు తర్వాతి నుంచి రోజుకు రూ.100 చొప్పున జరిమానా

ఇదీ చూడండి: భారీగా తగ్గిన కండోమ్ విక్రయాలు- కారణం అదేనా?​​​​​​​

Geneva (Switzerland), Sep 21 (ANI): Spiritual leader Haji Syed Salman Chishty of Ajmer Sharif has categorically asked the people of Jammu and Kashmir to embrace an opportunity after the abrogation of Article 370 and Article 35(A) for the prosperity of their coming generations. Speaking to ANI after addressing an event at University of Geneva, Chishty said, "It's an opportunity and it's a way where every Kashmiri should come forward and contribute and embrace this opportunity for the sake of their own children, for their children's future and for the sake of Kashmir to be prosperous". Criticising Pakistan over its misinformation over abrogation of Article 370 and 35(A), the spiritual leader said, "Pakistan has their own ideas, their own language that they can use and justify whatever they think about 8 or 9 crore Muslims in Kashmir. When they put these numbers do they become blind to see 180 million Muslims across India living peacefully, happily contributing to the nation state building for over hundreds of years? It is their own blindness which restricts them to see the full picture that India is". He also said, "Kashmir has always been an integral part of India. There is no 'ifs' and 'buts' about it and there cannot be".

Last Updated : Oct 1, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.