దిగ్గజ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐకి (ICICI Quarterly results) లాభాల పంట పండింది. 2021-22 రెండో త్రైమాసికంలో (ICICI Q2 results 2022) రూ.6,092 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. ఇది అంతకుముందు ఏడాది క్యూ2తో (ICICI Q2 results 2021) పోలిస్తే 24.7 శాతం అధికం. అదేసమయంలో, బ్యాంకు ఆదాయం రూ.39,484.50 కోట్లుగా నమోదైంది.
స్టాండ్ఎలోన్ ప్రతిపాదికన నికర లాభం (ICICI Q2 results) 30 శాతం పెరగి రూ.5,511గా నమోదైంది. స్టాండ్ఎలోన్ ప్రతిపాదికన ఆదాయం రూ.26,031గా ఉంది.
బ్యాంకు ఆస్తుల నాణ్యత పెరిగింది. నిరర్ధక ఆస్తుల శాతం 4.82 శాతానికి పరిమితమైంది. గతేడాది ఈ త్రైమాసికంలో ఇది 5.17 శాతంగా ఉంది. నికర నిరర్ధక ఆస్తులు (బ్యాడ్ లోన్స్) ఒకటి నుంచి 0.99 శాతానికి తగ్గిపోయాయి.
ఇదీ చదవండి: 'డేటా వినియోగంలో మనమే అధికం.. నెలకు 12జీబీ వాడకం'