ETV Bharat / business

కరోనా కాలంలో గేర్​ మార్చిన ఐటీ రంగం

వర్క్​ ఫ్రమ్​ హోమ్​... వీడియో కాల్స్​... జూమ్​ మీటింగ్స్​... ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల పనితీరు ఇది. కరోనా వల్ల వచ్చిన ఈ మార్పులతో ఐటీ రంగానికి లాభమా? నష్టమా? ఉద్యోగుల ఉత్పాదకత పెరిగిందా? తగ్గిందా?

How corona Changed IT sector Working Model
కరోనాతో మారిన ఐటీ వర్కింగ్ మోడల్
author img

By

Published : Sep 17, 2020, 1:20 PM IST

కరోనా కారణంగా అన్ని రంగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి. అందులో ఐటీ రంగం కూడా ముఖ్యమైంది. ఐటీ కంపెనీలకు సంబంధించిన సాంకేతికతల విషయంలో కరోనా తీవ్ర మార్పులకు లోనుచేసింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ తదితర అత్యాధునిక సాంకేతికతల వాడకం ఉన్నప్పటికీ.. కరోనా వల్ల ఐటీ కంపెనీలు వీటికి మారటం తప్పనిసరి అయిపోయింది.

"అత్యాధునిక సాంకేతికలను ఉత్పాదకంగా వాడుకునేందుకు కరోనా అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ సాంకేతికలకు సంబంధించిన ఉత్పత్తులు డిజైన్​లు ఆలోచన స్థాయిలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటి వాడకం పెరిగిపోయింది. దీనివల్ల ఇతర కంపెనీలతో పాటు ఐటీ సంస్థలు వీటిపై దృష్టి సారించే పరిస్థితి ఏర్పడింది. ఐటీ వృత్తి నిపుణులు కూడా అత్యాధునిక సాంకేతికతపై నైపుణ్యాలు సంపాదించం తప్పనిసరి అయిపోయింది. ఒకప్పుడు ఆరు నెలల్లో నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు ఇప్పుడు కేవలం ఆరు వారాల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది."

- రఘు, ఓ ఐటీ సంస్థ వ్యాపార అధిపతి

మెరుగైన ఉత్పాదకత..

కరోనా వల్ల ఉద్యోగ నష్టం జరిగినప్పటికీ.. కంపెనీలకు నిర్వహణ సామర్థ్యం పెరిగింది. ఒకప్పటిలా కంపెనీ అంటే పెద్ద కార్యాలయం ఉండాలి అన్న పరిస్థితి ఇప్పుడు లేదు. వేగవంతమైన ఇంటర్నెట్‌ సదుపాయం ఇప్పుడు అందరికీ ఇంటి దగ్గరే అందుబాటులో ఉంది. దీనివల్ల అక్కడి నుంచే పనిచేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి ఐటీ సంస్థలు.

ఒకప్పుడు వర్క్‌ ప్రం హోం.. ఉద్యోగి వెసులుబాటు కోసం ఇచ్చే సదుపాయం మాత్రమే. కానీ కరోనా వల్ల ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరి నుంచే పనిచేయటం పని చేయడం తప్పనిసరైంది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటం వల్ల కార్యాలయం నిర్వహణ ఖర్చులు కూడా తగ్గాయి.

ఇంతకు ముందు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఎక్కువసేపు ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీనివల్ల ఒత్తిడి, అలసట వంటి సమస్యలు ఉండేవి. ఫలితంగా ఉత్పాదకత తగ్గేది. ఇప్పుడు వర్క్‌ ఫ్రం హోం చేస్తుండటం వల్ల ఉద్యోగులు కుటుంబంతో సమయం వెచ్చించగలుగుతున్నారు. దీనితో ఉత్పాదకత కూడా మెరుగైనట్లు ఐటీ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఉద్యోగుల మధ్య సమావేశాలు ఇలా..

వర్క్‌ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు అంతా కలిసి ఒక్క ప్రదేశంలో పనిచేసే వాతావారణం ఉండటం లేదు. ఒకే ప్రాజెక్ట్​పై పని చేస్తున్నప్పుడు ఉద్యోగులు చర్చించుకునేందుకు మునుపటిలా వీలుండటం లేదు. ఇందుకోసం ఐటీ కొత్త ఉపాయాలు ఆలోచిస్తున్నాయి. నెలకోసారి ఉద్యోగులంతా కలిసేలా అవుటింగ్ ఏర్పాటు చేయటం, వర్చువల్‌ ప్లేయింగ్‌ రూమ్స్‌ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి. భౌతికంగా కలిసేందుకు వీలు లేకున్నా.. వర్చువల్​గా కలిసి ఉండేలా కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి.

నైపుణ్యాల పెంపు తప్పనిసరి...

ఐటీ సంస్థల అవసరాలకు.. విద్యా సంస్థల్లో అందిస్తున్న నైపుణ్యాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగంలో చేరాలంటే ఐటీ సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు పెంచుకోవడం తప్పనిసరిగా మారింది.

ఉద్యోగాలు కూడా కరోనా ముందు, తర్వాత అనే విధంగా మారిపోయాయి. కరోనా వల్ల ఉద్యోగాలపై పెరిగిన ఆందోళనలతో చాలా మంది వారి నైపుణ్యాలను పెంచుకునేందుకు ముందుకొస్తున్నారు.

"నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పరిస్థితిని.. కరోనా పూర్తిగా మార్చేసింది. ఆన్‌లైన్​కు మారాల్సిన పరిస్థితి తప్పనిసరి చేసింది. ఉద్యోగం కోరుకుంటున్న విద్యార్థులు పెరిగినట్లు ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌పై నిర్లక్ష్యం వహించినప్పటికీ.. కరోనా వల్ల అదొక్కటే దారిగా మారింది."

-రాజేష్‌ నల్లా, టెకీ మ్యాక్స్‌ ఐటీ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు

ఇదీ చూడండి:ప్రతిబంధకాలను అధిగమిస్తేనే వ్యాక్సిన్​ పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.