ETV Bharat / business

హెటిరో 'కరోనా మందు' ధర రూ.5,400 - హెటిరో కొవిఫిర్ ధర ఎక్కువే

కరోనాను నిరోధించే యాంటీ వైరల్ ఔషధం రెమ్​డెసివిర్ ధరను రూ. 5,400గా నిర్ణయించినట్లు ప్రకటించింది ఫార్మా దిగ్గజం హెటిరో. 'కొవిఫిర్​' పేరుతో తొలిదఫాలో 20,000 డోసులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పింది.

hetero covifir
హెటిరో 'కొవిఫిర్' ధర రూ. 5,400
author img

By

Published : Jun 24, 2020, 5:18 PM IST

భారత్​లో కరోనాకు చెక్​ పెట్టే లక్ష్యంతో రెమ్​డెసివిర్ తయారీకి అనుమతి పొందిన ఫార్మా సంస్థ హెటిరో 'కొవిఫిర్' పేరుతో వైరస్ నిరోధక ఔషధాన్ని విడుదల చేసింది. ఈ మందును దేశవ్యాప్తంగా రూ. 5,400కు అమ్మనున్నట్లు చెప్పింది. ఇప్పటికే 20,000 డోసులను సిద్ధం చేసిన హెటిరో 10,000 డోసులను వైరస్​తో తీవ్రంగా ప్రభావితమవుతున్న దిల్లీ, గుజరాత్, తమిళనాడు, హైదరాబాద్​, ముంబయి సహా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. మరో 10,000 డోసులను కోల్​కతా, ఇండోర్, భోపాల్, లఖ్​నవూ, పట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చిన్, త్రివేండ్రం, గోవాకు సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేసింది.

"కొవిఫిర్ భారత్​లో విడుదల కావడం ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ మందు తీసుకోవడం ద్వారా కరోనా చికిత్సా కాలం తగ్గుతుందని భావిస్తున్నాం. తద్వారా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటున్నాం."

- శ్రీనివాస రెడ్డి, హెటిరో ఫార్మా ఎండీ

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ ఔషధాన్ని అందుబాటులోకి ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు శ్రీనివాసరెడ్డి. ఈ నెల 21న హెటిరో సంస్థకు కొవిఫిర్ ఉత్పత్తికి కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతించినట్లు పేర్కొన్నారు.

హెటిరోతో పోలిస్తే సిప్లా ధర తక్కువ!

ఔషధ దిగ్గజం సిప్లా తాను విడుదల చేసే రెమ్​డెసివిర్ డోస్ ధర రూ. 5000 కంటే తక్కువే ఉంటుందని.. రాబోయే 8 నుంచి 10 రోజుల్లో మార్కెట్లోకి తమ రెమ్​డెసివిర్ ఔషదాన్ని తీసుకొస్తామని చెప్పింది.

ఇదీ చూడండి: హిందుజా సోదరుల మధ్య ఆస్తి వివాదం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.