కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎంతగా పతనమైందో తెలిసిందే. దీంతో వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు బడా కంపెనీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, హవేల్స్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల కొవిడ్ టీకా ఖర్చులను భరించేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఈ జాబితాలో చేరింది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు టీకాలను ఇప్పించనుంది.
-
.@HDFC_Bank to sponsor the inoculation of over 1 lakh employees of the Bank and their immediate family members. The Bank will reimburse the cost for both the mandated doses of the #vaccination. Read the #PressRelease here: https://t.co/mXijJoxSDI#Covid #Vaccine pic.twitter.com/E4FqihFcuN
— HDFC Bank News (@HDFCBankNews) March 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@HDFC_Bank to sponsor the inoculation of over 1 lakh employees of the Bank and their immediate family members. The Bank will reimburse the cost for both the mandated doses of the #vaccination. Read the #PressRelease here: https://t.co/mXijJoxSDI#Covid #Vaccine pic.twitter.com/E4FqihFcuN
— HDFC Bank News (@HDFCBankNews) March 12, 2021.@HDFC_Bank to sponsor the inoculation of over 1 lakh employees of the Bank and their immediate family members. The Bank will reimburse the cost for both the mandated doses of the #vaccination. Read the #PressRelease here: https://t.co/mXijJoxSDI#Covid #Vaccine pic.twitter.com/E4FqihFcuN
— HDFC Bank News (@HDFCBankNews) March 12, 2021
అంతకుముందు అమెరికా ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లో ఆ సంస్థ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారితో కలిపి మొత్తం 6లక్షల మందికి టీకాలు వేయిస్తామని ప్రకటించింది. దీంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, సహాయ సిబ్బంది, భద్రతా సిబ్బంది వారి కుటుంబీకులకు కూడా టీకాలు అందజేస్తామని పేర్కొంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ కంపెనీలు కూడా ఆ తర్వాత ఈ జాబితాలో చేరాయి. 11వ తేదీన విద్యుత్ ఉపకరణాలు తయారు చేసే హవేల్స్ కూడా తమ కంపెనీలోని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులకు టీకాలు వేయిస్తామని తెలిపింది.
ఇదీ చదవండి:మస్క్, బెజోస్‌ను మించి అదానీ సంపద వృద్ధి!