వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడు నెలల తర్వాత.. తిరిగి నవంబర్‌లో రూ.లక్ష కోట్ల మార్క్‌ను అందుకన్నాయి. గత నెలలో మొత్తం రూ.1.03 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది.
గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే.. గత నెలలో వసూళ్లు 6 శాతం పెరిగాయి. 2018 నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.95,380 కోట్లుగా ఉన్నాయి.
ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబర్‌లో దేశీయ లావాదేవీల నుంచి 12 శాతం జీఎస్టీ వసూళ్లు పెరగటం ఇందుకు కారణంగా పేర్కొంది కేంద్రం.
నవంబర్ వసూళ్ల లెక్కలు..
- మొత్తం జీఎస్టీ వసూళ్లు- రూ.1,03,492 కోట్లు
- కేంద్ర జీఎస్టీ- రూ.19,592 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ-రూ.27,144 కోట్లు
- సమీకృత జీఎస్టీ-రూ.49,028 కోట్లు
- సెస్- రూ.7,727 కోట్లు
ఇదీ చూడండి:ఆర్బీఐ నిర్ణయాలే ఈవారం మార్కెట్లకు కీలకం!