ETV Bharat / business

ఐఆర్​సీటీసీలో 15-20 శాతం వాటా విక్రయం! - ఐఆర్​సీటీసీలో 20 శాతం వాటా విక్రయం

ఐఆర్​సీటీసీలో వాటా విక్రయానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో 15-20 శాతం వాటా విక్రయానికి యోచిస్తోంది.

DIPAM ON IRCTC STAKE SALE
ఐఆర్​సీటీసీలో 20 శాతం వాటా విక్రయం
author img

By

Published : Sep 9, 2020, 8:14 AM IST

ఐఆర్​సీటీసీలో 15-20 శాతం వాటాను ఆఫర్​ ఫర్ సేల్ పద్ధతిలో (ఓఎఫ్​ఎస్​) విక్రయించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు తక్కువ విడతల్లోనే ఈ లావాదేవీని పూర్తి చేయాలని భావిస్తోంది.

ఐఆర్​సీటీసీలో వాటా విక్రయ ప్రక్రియ నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నుంచి బిడ్​లను ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపమ్) ఇప్పటికే ఆహ్వానించింది.

బిడ్​ల దాఖలుకు సెప్టెంబర్ 10ని గడవు తేదీగా నిర్ణయించింది దీపమ్. ఆసక్తిగల కొనుగోలుదార్లతో ఆగస్టు 4న ప్రి-బిడ్ సమావేశం నిర్వహించింది. ఇందులో వాళ్లు లేవనెత్తిన సందేహాలపై స్పందిస్తూ వాటికి సమాధానాలను తన వెబ్​సైట్​లో ఉంచింది. ఎంత మేర వాటాను ప్రభుత్వం తగ్గించుకోనుందనే ప్రశ్నకు సమాధానంగా.. 15-20 శాతం ఉండొచ్చు అని పేర్కొంది.

ఇదీ చూడండి:'కీలక ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అధ్వానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.