ETV Bharat / business

గూగుల్​ ఉద్యోగులకు 2021 జూన్ వరకు వర్క్​ ఫ్రం హోమ్​ - work from home in Google

ఇంటి నుంచే పని చేసే విధానాన్ని పొడిగిస్తూ టెక్ దిగ్గజం గూగుల్​ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది జూన్​ 30 వరకు ఇంటి నుంచే పని చేయాలని తమ ఉద్యోగులకు సమాచారం అందిచారు సీఈఓ సుందర్​ పిచాయ్​.

Google to keep most of its employees at home until July 2021
గూగుల్​ ఉద్యోగులకు 2021 జూన్ వరకు ఇంటి నుంచే పని
author img

By

Published : Jul 28, 2020, 9:47 AM IST

ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు ఇంటి నుంచి పని విధానాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్‌ ద్వారా సమాచారం అందించారు సీఈఓ సుందర్‌ పిచాయ్‌.

గూగుల్‌లో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, కరోనా వెలుగుచూసిన తొలినాళ్లల్లోనే ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించిన గూగుల్... అందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు ప్రతి ఉద్యోగికి వెయ్యి అమెరికన్‌ డాలర్ల అలవెన్సులు మంజూరు చేసింది.

దాదాపుగా సాంకేతిక సంస్థలన్నీ ఇంటి నుంచి పని విధానాన్నే అవలంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌... తమ ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేసేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: పసిడి ఆభరణాలకు హాల్​మార్కింగ్ గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.