ETV Bharat / business

గోద్రేజ్​ నుంచి -70 డిగ్రీల సెల్సియస్‌ రిఫ్రిజరేటర్‌

author img

By

Published : Dec 25, 2020, 7:21 AM IST

గోద్రేజ్ అప్లయిన్సెస్​ వచ్చే నెలలో -70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సదుపాయమున్న రిఫ్రిజరేటర్​​ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ నిల్వ, సరఫరా కోసం ఉపయోగపడే విధంగా వీటిని రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ -20 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రత ఉండే మెడికల్ ఫీజర్లను తయారు చేస్తోంది.

Godrej refrigerator for COVID-19 vaccine
గోద్రేజ్​ నుంచి వ్యాక్సిన్​ కోసం అతిశీతల ఫ్రీజర్

కొవిడ్‌-19 టీకాల నిల్వ, సరఫరా కోసం అత్యంత శీతల ఉష్ణోగ్రత (-70 డిగ్రీల సెల్సియస్‌) సదుపాయం ఉండే రిఫ్రిజరేటర్‌లను జనవరిలో ఆవిష్కరించేందుకు గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం -20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత కలిగే మెడికల్‌ ఫ్రీజర్లను సంస్థ తయారు చేస్తోంది. వీటి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10,000 యూనిట్ల నుంచి 35,000కు పెంచింది కూడా.

"దేశీయంగా, అంతర్జాతీయంగా అవసరం పడితే -70 డిగ్రీల సెల్సియస్‌ ఫ్రీజర్లను తెచ్చేందుకూ మేం సిద్ధంగా ఉన్నాం. జనవరిలో దీనిని ఆవిష్కరించాక.. అప్పుడు విడుదల చేసేందుకు దరఖాస్తు పెట్టుకుంటామ"ని కంపెనీ బిజినెస్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది తెలిపారు.

ఫైజర్‌ కొవిడ్‌-19 టీకా నిల్వకు -70 డిగ్రీస్‌ సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరమన్న సంగతి విదితమే. ప్రస్తుతం -70 డిగ్రీ ఫ్రీజర్‌ టెస్టింగ్‌ దశలో ఉందని కంపెనీ అసిస్టెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ జైశంకర్‌ నటరాజన్‌ పేర్కొన్నారు. 200-300 లీటర్ల రిఫ్రిజిరేటర్‌ ధర రూ.7-8 లక్షలు మధ్య ఉండొచ్చని అనుకుంటున్నామని తెలిపారు. టెస్టింగ్‌, అనుమతులు లభించడం పూర్తయ్యాక ధరపై ఓ అంచనాకు వస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:'కొవాక్స్‌'తో కలిసి తయారీ: అరబిందో

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.