ETV Bharat / business

'జీతాలు ఇవ్వలేం-సెలవులు తీసుకోండి' - విమాన రంగంపై లాక్‌డౌన్ ప్రభావం

దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా విమానయాన సంస్థల్లో సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్​ నెల వేతనాలు ఇవ్వలేమని గోఎయిర్‌ సంస్థ తెలిపింది. ఇందుకోసం భారీ సంఖ్యలో సంస్థ ఉద్యోగులను వేతనాలు లేని సెలవులపై పంపనున్నట్లు ప్రకటించింది. మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్‌ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

no salary leaves to goair Employees
గో ఎయిర్ ఉద్యోగులకు వేతనాలు లేని సెలవులు
author img

By

Published : Apr 19, 2020, 6:37 PM IST

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని సంస్థల ప్యాసింజర్ విమానాలు నేలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్ పొడిగింపుతో మే 3 వరుకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది ప్రముఖ బడ్డెట్ విమానయాన సంస్థ గో ఎయిర్‌. దాదాపు 5,500 మంది ఉద్యోగులను మే 3 వరకు వేతనాలు లేని సెలవులపై పంపేందుకు సిద్ధమైంది.

అయితే ప్రస్తుతానికి సంస్థ కార్యకలాపాలు లేనప్పటికీ దాదాపు 5,500 ఉద్యోగుల్లో 10 శాతం మందిని.. కచ్చితంగా నిర్వహించాల్సిన కొన్ని కార్యకలాపాలకు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. వారికి నామమాత్రపు వేతనాలు చెల్లించనున్నట్లు వెల్లడించింది.

వాడియా గ్రూప్‌నకు చెందిన గోఎయిర్‌ సంస్థ మార్చిలోనూ ఉద్యోగులకు వేతనాలు లేని సెలవులు తీసుకోమని కోరింది.

ఆశలన్నీ మే 4పైనే..

మే 4 నుంచి విమాన సేవలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు గో ఎయిర్‌ పేర్కొంది. లాక్‌డౌన్ తర్వాత దశల వారీగా సేవలు ప్రారంభిస్తామని తెలిపింది.

అదే బాటలో స్పైస్‌జెట్‌..!

బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ కూడా గోఎయిర్​ బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. స్పైస్‌ జెట్ ఉద్యోగుల్లో రూ.50,000 కన్నా ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగులను రోటేషన్ పద్ధతిలో జీతంలేని సెలవులపై పంపనున్నట్లు తెలుస్తోంది.

ఇది వరకే మార్చి 25 నుంచి 31 మధ్య సంస్థ ఉద్యోగుల్లో చాలా మందిని వేతనాలు లేని సెలవులపై పంపించింది.

ఇదీ చూడండి:ఉద్యోగుల పింఛన్లలో కోతపై ప్రభుత్వం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.