ETV Bharat / business

ల్యాండ్​లైన్ ఉంటే 6 స్మార్ట్​ఫోన్స్​ నుంచి కాల్స్​ ఫ్రీ! - ల్యాండ్​లైన్​

'జియో ఫిక్స్​డ్​ వాయిస్'​లో వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. జియో ల్యాండ్​లైన్ అనుసంధానంతో.. స్మార్ట్​ఫోన్ల నుంచి ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. ఈ సౌకర్యం పొందడం ఎలానో తెలుసుకోండి.

ల్యాండ్​లైన్ ఉంటే 6 స్మార్ట్​ఫోన్స్​ నుంచి కాల్స్​ ఫ్రీ!
author img

By

Published : Aug 25, 2019, 7:01 AM IST

Updated : Sep 28, 2019, 4:32 AM IST

గిగా ఫైబర్​తో అంతర్జాల సేవల్లో సంచలనం సృష్టించబోతున్న జియో.. ల్యాండ్​లైన్ ద్వారా కాలింగ్​లోనూ బంపర్ ఆఫర్ ఇస్తోంది. జియో ఫిక్స్​డ్​ ల్యాడ్​లైన్​ ద్వారా ఉచిత కాల్స్​ సదుపాయం కల్పించనుంది. గిగాఫైబర్ ప్యాక్​తో కలిపే ల్యాండ్​లైన్​ సౌకర్యం కల్పిస్తోంది జియో.

జియో మాతృసంస్థ రిలయన్స్ సర్వసభ్య వార్షిక సమావేశానికి కేవలం కొన్ని రోజుల ముందే ల్యాండ్​లైన్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. గిగా ఫైబర్ బీటా యూజర్లు ఇప్పటికే ల్యాండ్​లైన్​ ద్వారా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతున్నారు.

ల్యాండ్​లైన్​లో అద్భుత ఫీచర్​..

ల్యాండ్​లైన్​ నెంబర్​ను స్మార్ట్​ ఫోన్​కు అనుసంధానం చేసి.. స్మార్ట్​ ఫోన్​ నుంచి ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించనుంది జియో. ఇందుకోసం యూజర్లు జియో కాలింగ్ యాప్​ ద్వారా ల్యాండ్​లైన్​ నెంబర్​ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

యాక్టివేట్ చేసుకోండిలా..

ఆండ్రాయిడ్​ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా, ఐ ఫోన్ యాప్​ స్టోర్ ద్వారా జియో కాలింగ్​ యాప్​ను డౌన్లోడ్​ చేసుకోవాలి. తర్వాత అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలి.

జియో 4జీ సిమ్​, జియోఫై కనెక్షన్​, ఫిక్స్​డ్​ ల్యాండ్​లైన్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ స్మార్ట్ ఫోన్​లో వీఓఎల్​టీఈ సదుపాయం లేకపోతే మొదటి ఆప్షన్​ ఎంచుకోవాలి. జియో ఫై ద్వారా కాల్స్​ వెళ్లాలి అనుకుంటే రెండో ఆప్షన్​ ఎంచుకోవాలి. మీకు జియో ఫిక్స్​డ్​ వాయిస్ ​కనెక్షన్ ఉంటే మూడో ఆప్షన్​ ఎంచుకోవాలి. ఈ దశ పూర్తయిన తర్వాత మీరు నమోదు చేసుకున్న నెంబర్​కు ఓటీపీ వస్తుంది. దాన్ని సమర్పిస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. చివరి దశ పూర్తయిన తర్వాత స్మార్ట్ ఫోన్ల నుంచి ఉచిత కాలింగ్​కు సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గరిష్ఠంగా ఆరు ఫోన్లను... జియో ల్యాండ్​లైన్ నెంబర్​కు అనుసంధానం చేసుకోవచ్చు.
ఉచితంగా కాల్స్ చేయాలాన్నా, కాల్స్​ పొందాలన్నా జియో రూటర్​తో అనుసంధానమై ఉండాలి.

వచ్చే నెల 5 నుంచి గిగా ఫైబర్​ వాణిజ్య సేవలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు జియో బ్రాడ్​బాండ్ ప్లాన్లు, ల్యాండ్​లైన్​లకు సంబంధించి ఆఫర్ల పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఇదీ చూడండి: ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్​బీఐ

AP Video Delivery Log - 1200 GMT News
Saturday, 24 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1154: SKorea Japan Protest AP Clients Only 4226461
Seoul rally denounces Japanese govt for trade curbs
AP-APTN-1141: France G7 Protest 2 AP Clients Only 4226460
Several thousand march against G7 summit
AP-APTN-1139: France G7 Protest AP Clients Only 4226451
Protesters march against G7 summit
AP-APTN-1131: France G7 EU Tusk 2 AP Clients Only 4226458
EU's Tusk on Amazon fires, US-China trade war
AP-APTN-1126: France G7 EU Tusk AP Clients Only 4226452
Tusk on Amazon, trade wars, Iran deal, Brexit
AP-APTN-1125: France G7 Trump AP Clients Only 4226457
Trump arrives in France for G7 summit
AP-APTN-1109: UAE Modi Medal AP Clients Only 4226456
Indian PM receives UAE's highest civilian honour
AP-APTN-1102: West Bank Aftermath AP Clients Only 4226455
Israeli troops in WBank after teen killed in blast
AP-APTN-1053: At Sea Migrants AP Clients Only 4226454
NGOs on rescued migrants in Malta
AP-APTN-1015: Malta Migrants No access Malta 4226436
Rescued migrants disembark in Malta
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 4:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.