ETV Bharat / business

Remdesivir: నకిలీ ఔషధాలకు జైడస్ క్యాడిలా చెక్!

మార్కెట్లో తమ కంపెనీ పేరుతో వచ్చే నకిలీ రెమ్​డెసివర్ ఔషధాలకు చెక్​ పెట్టే విధంగా ఫార్మా సంస్థ జైడస్​ క్యాడిలా కొత్త రకం ప్యాకింగ్ సాంకేతికతను వాడనున్నట్లు వెల్లడించింది. త్వరలో ఓ స్క్రాచ్​ కోడ్​ను ప్యాకింగ్​పై ముద్రించనున్నట్లు తెలిపింది. ఆ కోడ్​ను ఉపయోగించి వినియోగదారులే సులభంగా అది నకిలీదా, నిజమైందా అనేది తెలుసుకోవచ్చని వివరించింది.

safety feature by zydus cadila
జైడస్​ క్యాడిలా సేఫ్టీ ఫీచర్​
author img

By

Published : May 28, 2021, 7:12 PM IST

మార్కెట్లో ఈ మధ్య కాలంలో నకిలీ ఔషధాల దందా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా కరోనా వ్యాధికి వినియోగించే మందుల విషయంలో నకిలీలు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు నిజమైన మందులను గుర్తించే విధంగా.. తమ కంపెనీ ఔషధాలకు ప్రత్యేక ప్యాకింగ్​ టెక్నాలజీని వాడనున్నట్లు జైడస్ క్యాడిలా వెల్లడించింది.

కంపెనీ ఉత్పత్తులైన రెమ్​డెసివర్​, విరఫిన్ ఇంజక్షన్ వంటి ఔషధాలతో మొదటగా ఈ కొత్త రకం ప్యాకింగ్​ను ప్రారంభించనున్నట్లు జైడస్​ క్యాడిలా తెలిపింది. జూన్​ మూడో వారంలో ఈ ప్యాకింగ్​తో ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో ఇతర ఔషధాలకు ఈ విధమైన ప్యాకింగ్​ను​ అమలు చేయనున్నట్లు వివరించింది.

ఏంటి ఈ కొత్త రకం ప్యాకింగ్..?

కొత్త రకం ప్యాకింగ్​లో మందులపై ఓ స్క్రాచ్​ కోడ్​ను ముద్రించనుంది కంపెనీ. వినియోగదారులు ఔషధాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ స్క్రాచ్​​ కోడ్​ను ఉపయోగించి కంపెనీ మొబైల్​ యాప్​ లేదా వెబ్​సైట్ సాయంతో ఆ ఔషధం నకిలీదా, నిజమైందా అనేది తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: Covaxin Timeline: టీకా తయారీకి ఎన్ని రోజులు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.