ETV Bharat / business

'ఓలా ఎలక్ట్రిక్​' రికార్డ్- 2 రోజుల్లో రూ.1,100 కోట్ల విక్రయాలు - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​ ఫీచర్లు

ఎలక్ట్రిక్​ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్​ (Ola Electric record) సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం రెండు రోజుల్లో రూ.1,100 కోట్ల విలువైన ఈ-స్కూటర్ల (Ola Electric Scooter sales) విక్రయాలు సాధించింది. ఆంచనాలకు మించి ఆర్డర్లు రావడం వల్ల తాత్కాలికంగా విక్రయాలను నిలిపివేసింది.

Ola E-scooter
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​
author img

By

Published : Sep 17, 2021, 2:26 PM IST

ఎలక్ట్రిక్​ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు (Ola Electric record) సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయని (Ola Electric Scooter sales) సంస్థ సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. భారీ ఆర్డర్ల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి విక్రయాల ప్రక్రియను నిలిపివేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా నవంబరు 1న విక్రయాలు పునఃప్రారంభమవనున్నాయి.

ఆన్‌లైన్‌లో బుధవారం ఉదయం ఓలా స్కూటర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలి 24 గంటల్లో సెకనుకు 4 స్కూటర్ల చొప్పున రూ.600 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. రెండో రోజు నాటికి ఆ విక్రయాలు రూ.1,100 కోట్ల విలువకు చేరుకున్నాయి. వాహన రంగ చరిత్రలోనే ఇదో రికార్డని భవీష్‌ అభిప్రాయపడ్డారు.

ఎస్‌ 1 (Ola Electric Scooter Price) (ధర రూ.99,999), ఎస్‌ 1 ప్రో (రూ.1,29,999)లను ఆగస్టు 15న ఆవిష్కరించిన ఓలా, జులై నుంచే రూ.499తో ముందస్తు బుకింగ్‌కు అవకాశం కల్పించింది. అప్పుడు 24 గంటల్లో లక్షకు పైగా బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది. ఓలా యాప్‌ ద్వారా ఈనెల 15 నుంచి రూ.20,000 చెల్లించి, కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే సరిపోతుంది. వచ్చే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు డబ్బులు చెల్లించిన వారికి, ఎప్పుడు సరఫరా చేసేదీ 72 గంటల్లోగా వెల్లడించనుంది. ఏడాదికి 10 లక్షల స్కూటర్లను తయారు చేసే సామర్థ్యంతో తమిళనాడులో ఓ ప్లాంటును నిర్మిస్తోంది ఓలా ఎలక్ట్రిక్​.

ఇదీ చదవండి: రూ.2,999 ఈఎంఐతో ఓలా ఈ-స్కూటర్​.. కొనేయండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.