ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్, ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా వచ్చే వారం ఇరువురినీ విచారించనుంది ఈడీ.
ఫెర్నాండెజ్‌ను జనవరి 20న.. ప్రస్తుత, మునుపటి యాజమాన్యంలోని ఇతరులను వారికి కేటాయించిన తేదీల్లో ఈడీ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. కేసుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను సమర్పించాలాని పేర్కొంది.
ఏమిటీ కేసు?
ఎయిర్ ఏషియాకు చెందిన భారత వెంచర్ ఎయిర్ ఏషియా ఇండియా లిమిటెడ్ అంతర్జాతీయ సేవల లైసెన్స్ పొందేందుకు.. ప్రభుత్వ పాలసీలకు విరుద్ధంగా, తప్పుడు మార్గాల్లో అనుమతులు పొందినట్లు అభియోగాలు మోపింది ఈడీ.
2018 మేలో ఈ విషయంపై సీబీఐ తొలుత క్రిమినల్ కేసు నమోదు చేసింది. రెండు రోజుల అనంతరం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ), ఫారెన్ ఎక్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)కింద కేసు నమోదు చేసింది ఈడీ.