ETV Bharat / business

ఫెడ్ వడ్డీ రేట్లు, కీలక గణాంకాలే ఈ వారానికి కీలకం - ఫెడ్ వడ్డీ కోత

దేశీయంగా కీలక గణాంకాలు, అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధానాంశాలు. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ గత వారం భారీ నష్టాల్లో ముగిశాయి మార్కెట్లు.

మార్కెట్ల్ ముఖచిత్రం
author img

By

Published : Jul 28, 2019, 6:14 PM IST

కార్పొరేట్​ల తొలి త్రైమాసిక ఫలితాలు, కీలక ఆర్థిక గణాంకాలు, ఫెడ్​ వడ్డీ కోత వంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు ఈ వారం దిశానిర్దేశం చేయనున్నాయి. హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంకు సహా పలు దిగ్గజ సంస్థలు ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి.

గత వారం నష్టాల మోత

గత వారం మొత్తం మీద చూస్తే.. చివరి సెషన్​లో తప్ప మిగతా సెషన్లన్నీ నష్టాలతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ బలహీన సంకేతాలు, దేశంలో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం వంటి అంశాలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేశాయి. వారం మొత్తం మీద 454 పాయిట్లు కోల్పోయింది సెన్సెక్స్.

ఈ వారం మార్కెట్ల పయనమెటు?

గత వారం ఉన్న పరిస్థితులే ఈ వారం కూడా ఉండగా వీటికి అదనంగా కీలక ఆర్థిక గణాంకాలు వెల్లడి కానున్నాయి. వీటిపై మదుపరులు దృష్టి సారించొచ్చు.
అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల అంశంపై మదుపరులు దృష్టి సారించే అవకాశం ఉంది. జులై 31న జరిగే సమావేశంలో వడ్డీ కోతపై కీలక నిర్ణయం తీసుకోనుంది ఫెడ్.

విదేశీ పెట్టుబడుల తగ్గుదల కూడా గత వారం నష్టాలకు కారణం. విదేశీ పోర్ట్​ఫోలియో మదుపరులు వ్యవహరించే తీరు మార్కెట్లకు ఈ వారం కీలకంగా మారనుంది.

ఇదీ చూడండి: సైబర్ మోసాల నుంచి తప్పించుకోండిలా!

Bengaluru, Jul 28 (ANI): Karnataka Speaker KR Ramesh Kumar adviced all the Members of Legislative Assembly (MLA) to attend Assembly session for confidence motion for newly formed Karnataka government. He said, "BS Yediyurappa has asked me to oversee vote of confidence tomorrow. Karnataka Appropriation (Vote on Account) Bill, 2019 expires by July 31. I appeal to all MLAs to appear for the session for the confidence motion." Speaking about the recent political developments in Karnataka, he added, "Where have we reached? The way I am being pressurized to deal with the situation being a speaker. All these things have pushed me into a sea of depression."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.