భారత మార్కెట్లో తక్కువ సమయంలోనే బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థగా ఎదిగిన రియల్మీ.. ఇప్పుడు ఇతర స్మార్ట్ డివైజ్‌లను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవలే భారత్‌లో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన ఈ సంస్థ మరిన్ని స్మార్ట్ డివైజ్‌లను త్వరలోనే విడుదల చేయనుంది. ముఖ్యంగా షియోమీకి పోటీగా ఫిట్నెస్ బ్యాండ్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్ సహా ఇతర డివైజ్‌లను తీసుకురానుంది.
స్మార్ట్ డివైజ్‌లకు సంబంధించి రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్సేత్ ఒక టీజర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఫిట్నెస్ బ్యాండ్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్ క్లాక్, స్మార్ట్ స్పీకర్, కార్ ఛార్జర్, స్మార్ట్ వెయింగ్ స్కేల్, స్మార్ట్ టీవీ వంటి ఉత్పత్తులను రియల్మీ తీసుకురానుంది.
వాటిలో ఫిట్నెస్ బ్యాండ్‌ను మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది రియల్మీ.
స్మార్ట్డివైజ్ల విశేషాలు..
రియల్మీ త్వరలో విడుదల చేయనున్న డివైజ్‌లు ఒకదానితో మరొకటి అనుసంధానమయ్యే ఎకో సిస్టమ్ సాంకేతికతతో రానున్నట్లు తెలుస్తోంది.
స్మార్ట్ వాచ్‌ను.. రియల్మీ వాచ్ పేరుతో, గుండ్రటి డిస్ప్లేతో తీసుకురానుంది సంస్థ. ఈ వాచ్ అమోలెడ్ డిస్ప్లేతో రానున్నట్లు అంచనాలు ఉన్నాయి.
రియల్మీ స్మార్ట్ టీవీని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు మాధవ్ సేత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
-
Sharing an exciting first look of what all is in store for 2020. We are determined to make #realme the most loved Tech-Lifestyle brand.
— Madhav 5G (@MadhavSheth1) February 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch the launch at 2.30PM today to know more about it.https://t.co/8pkvjxXwcl pic.twitter.com/y0e2fGCNNC
">Sharing an exciting first look of what all is in store for 2020. We are determined to make #realme the most loved Tech-Lifestyle brand.
— Madhav 5G (@MadhavSheth1) February 24, 2020
Watch the launch at 2.30PM today to know more about it.https://t.co/8pkvjxXwcl pic.twitter.com/y0e2fGCNNCSharing an exciting first look of what all is in store for 2020. We are determined to make #realme the most loved Tech-Lifestyle brand.
— Madhav 5G (@MadhavSheth1) February 24, 2020
Watch the launch at 2.30PM today to know more about it.https://t.co/8pkvjxXwcl pic.twitter.com/y0e2fGCNNC
2020లో రూ.3000 కోట్లు లక్ష్యం..
భారత్‌లో ఈ ఏడాది మొత్తం 20 కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు మాధవ్ సేత్. వీటి ద్వారా రూ.3,000 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి కొత్త ఉత్పత్తుల గురించిన సమాచారం లేనప్పటికీ.. భారత మార్కెట్‌పై రియల్మీ భారీ ప్రణాళికతో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:ముడి ఔషధాలకు కరోనా సెగ