కరోనా సంక్షోభంతో విమానయాన సంస్థలు తీవ్రంగా కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ విమానయాన సంస్థలు ఖర్చులు తగ్గించుకునేపనిలో పడ్డాయి. ఇందుకోసం ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి.
డచ్‌కు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ కేఎల్ఎం కూడా ఇదే బాటను ఎంచుకుంది. ప్రస్తుత సంక్షోభం వల్ల 4,500 నుంచి 5,000 ఉద్యోగాలను తగ్గించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
ఉద్యోగాల కోతలు ఇలా..
1,500 మంది తొలగింపు, 1,500 మంది కాంట్రాక్టుల రెన్యువల్ల నిలిపివేత, పదవీ విరమణ ప్రక్రియ ద్వారా మరో 2,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు కేఎల్ఎం ఎయిర్‌లైన్స్ తెలిపింది. మరో 500 ఉద్యోగాల కోతకూ అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
కరోనా కారణంగా విమానయాన రంగానికి తగ్గిన డిమాండ్ తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు 2023 లేదా 2024 వరకు అవకాశం లేదని కేఎల్ఎం అంచనా వేసింది. ఈ కారణంగా భవిష్యత్‌లోనూ ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని పేర్కొంది.
ఇదీ చూడండి:రూ.54 వేల మార్క్ దాటిన 10 గ్రాముల పసిడి