ETV Bharat / business

ఈ కంపెనీల నిమిషం సంపాదన ఎంతో తెలుసా?

యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్​.. వంటి దిగ్గజాలు టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. గూగుల్, ఫేస్​బుక్​, టెస్లా వంటి కంపెనీలు కూడా తమ రంగాల్లో దిగ్గజాలుగా వెలుగొందుతున్నాయి. ఆయా కంపెనీలు ఈ స్థాయిలో ఉండేందుకు ప్రధాన కారణం అవి ఆర్జిస్తున్న ఆదాయాలే. మరి ఒక్క నిమిషానికి ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

author img

By

Published : May 23, 2021, 6:20 PM IST

tech giants revenue per minute
టెక్​ దిగ్గాజాల ఆదాయం

ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు అనగానే అమెజాన్, యాపిల్​, మైక్రోసాఫ్ట్​, గూగుల్​ వంటివి ముందుగా గుర్తొస్తాయి. 21వ శతాబ్దంలో ప్రారంభమైన టెస్లా, ఫేస్​బుక్​ వంటి కంపెనీలు కూడా దిగ్గజ సంస్థలకు పోటీనిస్తూ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆయా కంపెనీలు ఆర్జిస్తున్న లాభాలే ఇందుకు ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. మరి ఆ కంపెనీలు నిమిషానికి ఎంత ఆదాయాన్ని గడిస్తున్నాయో ఓ సారి చూద్దాం.

  • 2021 తొలి త్రైమాసికం గణాంకాల ఆధారంగా కంపెనీల ఆదాయాల వివరాలు ఇలా ఉన్నాయి.

అమెజాన్​

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ ఆదాయం నిమిషానికి సగటున 837,330 డాలర్లుగా తెలిసింది. 2021 క్యూ1లో ఈ సంస్థ మొత్తం ఆదాయం 100 బిలియన్ డాలర్ల మార్క్ దాటడం గమనార్హం.

అమెజాన్​ మార్కెట్ విలువ 1.76 ట్రిలియన్​ డాలర్లు.

Amazon
అమెజాన్

యాపిల్​

లగ్జరీ గాడ్జెట్ల తయారీ సంస్థ యాపిల్​ నిమిషానికి 691,235 డాలర్లు ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది తొలి ముడు నెలల్లో యాపిల్ ఆదాయం 89.6 బిలియన్​ డాలర్లుగా నమోదైంది.

యాపిల్ మార్కెట్ విలువ 2.2 ట్రిలియన్​ డాలర్లు (ప్రపంచంలో అత్యధిక మార్కెట్ విలువ ఉన్న కంపెనీ ఇదే).

Apple
యాపిల్​

ఆల్ఫాబెట్​ (గూగుల్​ మాతృ సంస్థ)

సెర్చ్ ఇంజన్​ దిగ్గజం గూగుల్​ మాతృ సంస్థ ఆల్ఫాబెట్​ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నిమిషానికి 426,806 డాలర్లు సంపాదించింది.

అల్ఫాబెట్ మార్కెట్ విలువ 1.6 ట్రిలియన్ డాలర్లు.

Google
గూగుల్​

మైక్రోసాఫ్ట్​

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆదాయం నిమిషానికి 321,806 డాలర్లుగా నమోదైంది. ఇంతకు ముందుతో పోలిస్తే ఈ సంస్థ ఆదాయం కాస్త తగ్గింది.

మైక్రోసాఫ్ట్ మార్కెట్​ విలువ 1.9 ట్రిలియన్ డాలర్లు.

Microsoft
మైక్రోసాఫ్ట్​

ఫేస్​బుక్​

సోషల్​ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​ నిమిషానికి 201,937 డాలర్ల ఆదాయాన్ని గడించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఫేస్​బుక్​ మార్కెట్ విలువ 925 బిలియన్​ డాలర్లు.

Facebook
ఫేస్​బుక్​

టెస్లా

ఎలాన్​ మస్క్​ అధినేతగా వ్యవహరిస్తున్న విద్యుత్​ కార్ల తయారీ సంస్థ టెస్లా ఆదాయం నిమిషానికి 80,162 డాలర్లుగా తెలిసింది.

టెస్లాలో మెజారిటీ వాటాదారుడిగా ఉన్నందున్న జెఫ్​ బెజోస్​ (అమెజాన్ అధినేత)ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచ కుబేరుడిగా అవతరించారు ఎలాన్​ మస్క్. అయితే ఇటీవల టెస్లా షేర్లు కుదేలవడం వల్ల మూడో స్థానానికి పరిమితమయ్యారు.

టెస్లా మార్కెట్ విలువ 677 బిలియన్ డాలర్లు.

Tesla
టెస్లా

నెట్​ఫ్లిక్స్

ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ విభాగంలో దూసుకుపోతున్న నెట్​ఫ్లిక్స్ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో నిమిషానికి సగటున 55,270 డాలర్లు గడించింది. గతంతో పోలిస్తే ఈ సంస్థ ఆదాయం కాస్త తగ్గింది. ముఖ్యంగా చందాదారుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

నెట్​ఫ్లిక్స్​ మార్కెట్​ విలువ 227 బిలియన్ డాలర్లు.

Netflix
నెట్​ఫ్లిక్స్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.